Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధీమాలేని పంట..శాస్త్రీయ సాయమే భరోసా..
- వెంటాడుతున్న అకాల వర్షాలు..ప్రతి యేటా నష్టాలే..
- ప్రతి రైతు ఇంటా 'పంట' రోధన..
- నేటి సీఎం కేసీఆర్ పర్యటనపై చిగురించిన ఆశలు..
నవతెలంగాణ-నర్సంపేట
ప్రతి యేటా అకాల, వడగండ్ల వానలు చేతికొచ్చే పంటను తు డిచిపెట్టుకపోతున్నాయి..ఆరుగాలం కష్టపడి లక్షలాదిగా పెట్టు బడులు పెట్టి పండించిన పంట చేజారుతూ రైతు కుటుంబా ల్లో కన్నీరే మిగుల్చుతుంది.. 2018, 2020, 2022 ఈ యేడాది వర సగా అకాల, నిరవధిక వర్షాలు రైతును నిండా ముంచాయి.. ఇం తటి నష్టాల ఊబిలో చిక్కుకుంటుండగా ఆపదలో ఆదుకొనేందుకు ప్రభుత్వాలకు మనసు రావడం లేదనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బృందాలతో సర్వేలు చేసి అంచనాలు రూ పొందించడం వరకే ప్రభుత్వం సరిపెట్టుకొంటూ వస్తుందని రైతులు వాపోతున్నారు. నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగు ల్లాలు పడుతున్నాయనే విమర్శలు వెలువడుతున్నాయి. జాతీయ ప్రకృతి వైపరీత్యాల చట్టం (డిజిస్టర్ మేనేజ్మెంట్ డివిజన్, జివో 2, 2015) ప్రకారం 60:40 నిష్పత్తిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాం టి సహాయం ప్రకటన వెలువడలేదు. ఎట్టకేలకు 2022 జనవరి 11న వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలపై రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేసింది.పంట నష్టం అంచనాల్లో డొల్లతనమే కన్పిస్తుంది. అంచనాల్లో శాస్త్రీయతో లేకుండా పోయింది. పంటపై పెట్టిన పెట్టుబడులు, పంటదశను పరిగణంలోకి తీసుకోకుండా నివేదిస్తున్న అంచనాల వల్ల రైతులకు పెద్దగా ఒరిగేదేమి లేదనే అబి óప్రాయం వ్యక్తమౌతుంది. తాజాగా విడుదల చేసిన జివో 42 ద్వారా వరి, మిరప, పత్తి పంటలకు హెక్టార్‌కు రూ.13,500లు, మొక్కజొ న్నపై రూ.8,333 మాత్రమే చెల్లించనుంది. నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు గీసుకొండ, సంగెం, రాయపర్తి మండలాల్లోని 91 గ్రామాల్లో 13,234 ఎకరాల మిర్చి పంటపై 12565 మంది రైతులకు రూ.7 కోట్ల 14లక్షలపైగా నష్టపరిహారం విడుదలైంది. డివిజన్లోని ఇందులో కేంద్రం వాటా లేదని మొత్తాంగానూ రాష్ట్ర ఖజానా నుంచే రైతులకు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం విడుదల చేసినా రైతుకు మాత్రం ఇంతే ఇచ్చే అవకాశం ఉం ది. ఈ నెల 18న రాత్రింభవళ్లు పడిన వడగండ్ల వాన వల్ల మొక్క జొన్న, మిరప, అరటి, కూరగాలు పంటలు దిగుబడులు చేతికందే దశలో దెబ్బతిన్నాయి. అనేక మంది ఇండ్లు ధ్వంసమై నిరాశ్రులయ్యా రు. వేలాదిగా విద్యుత్ స్థంభాలు విరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలి పోయాయి. పలు గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచి అంధ కారంలో ఉండిపోయాయి.పంట నష్టంపై అధికారులు ప్రిమిలరీ అంచనాలు రూపొందించారు.
ఉమ్మడి జిల్లాలో 11లక్షల ఎకరాల పైగా వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క నర్సంపేట డివిజన్లో నే 54 వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్లు తెల్సుతుంది. ఈ సారి చేపడుతున్న సర్వేల్లోనూ శాస్త్రీయత లేదనే చెప్పాలి. కింద టేడాది ప్రకటించినట్లే పరిహారం ఇస్తే రైతులకు ఊరట అంతంతా మాత్రమేనే చెప్పాలి. ఎకరాకుమిరప పంటపై రూ.1.50లక్షల పై గా రైతులు సాధారణ పెట్టుబడే అవుతుంది. ఇక వింత వైరస్ల నుంచి పంటను దక్కించుకొనేందుకు రెండింతల పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు తెలిపారు. వరి, మొక్కజొన్న పంటలపై పెట్టుబ డుల భారం విపరీతంగా పెరిగింది. ఇన్ని కష్టాలు, అప్పులు తెచ్చి పెట్టి పంటను దిగుబడులు వచ్చే కాపాడుకుంటుండగా ప్రకృతి వి కృతి రూపంలో విలయతాండవం చేస్తూ చేతికొచ్చే పంటను తుడిచి పెట్టుకపోతూ నిండా ముంచుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఈ పరిస్థితిల్లో దినదినా వ్యవసాయంపై నమ్మకం సన్నగి ల్లు పోతుందని వాపోతున్నారు. ప్రభుత్వం భరోసానిస్తేనే తప్పా ఇకపై పంటలను సాగు చేయలేమని దాసరిపల్లికి చెందిన ముగ్థం రాజేందర్ అనే రైతు అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా పంటలను సందర్శించడానికి నేడు సీఎం కేసీఆర్ పర్యటనపై రైతుల్లో కొత్త ఆశ లు రేకిత్తిస్తుంది. ఇప్పటికైనా శాస్త్రీయ అంచనాలతో ప్రభుత్వం నష్ట పరిహారాన్ని పెంచిఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.