Authorization
Mon February 24, 2025 03:50:39 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఈ నెల 18న పడిన వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు నేడు సీఎం కేసీఆర్ నర్సంపేట, పర్కాల నియోజకవర్గంలోని పలు గ్రామాలను సందర్శంచనున్నారు.ఈ మేరకు కేసీఆర్ పర్యటపై నర్సంపేట, పర్కాల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం దుగ్గొండి మండలంలోని అటవీ రంగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను అధికారులు, పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ వచ్చి అటవీ రంగాపురంలో పంటలను పరిశీలించి అక్కడి నుంచి వాహనంలో గిర్నిబావి మీదిగా కొమ్మాల, పల్లర్లగూడ, వంజర్లపల్లి , మచ్చాపురం, గంగదేవిపల్లి మీదిగా కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.ఈ సందర్భంగా పోలీసు భందో బస్తు చర్యలను డీసీపీ కర్ణాకర్, ఏసీపీ సంపత్‌రావు తదితర పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.