Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
టీఎన్జీఓస్ భవన్ లో పంచాంగ శ్రవణం నిర్వహించామని టీఎన్జీఓస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ ఉద్యో గులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యో గులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సంపూర్ణ సహాయ స హకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్ర భుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కొరకు కషి చేస్తానని అన్నా రు. ఉద్యమం నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా ఉద్యోగులు పెన్షనర్లు తనకు అండదండలు అందిస్తున్నారని అన్నారు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఉద్యోగుల పెన్షనర్ల కుటుంబ సభ్యు లందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవం తున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ తెలుగు వారి నూతన సంవత్సరము సందర్భంగా ఉద్యోగులందరికీ మంచి జరుగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ సంవ త్సరం కేంద్ర సంఘం అధ్యక్షులు ఆకుల రాజేందర్, ప్రధాన కార్యద ర్శి రాయి కంటి ప్రతాప్ నాయకత్వంలో మనం నూతన పి అర్ సి సాధించుకుంటామని మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరీ సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణు గోపాల్,కోశాధికారి పనికెల రాజేష్,కేంద్ర సంఘం ఉపాధ్యక్షడు శనిగరపు శ్యామ్ సుందర్,వరంగల్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్,భూపాలపల్లి అధ్యక్షులు బురుగు రవి,ములుగు అధ్యక్షులు జ్ఞానేశ్వర్, పేన్షనర్స్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షులు సర్వర్ హుస్సేన్,వరంగల్ అధ్యక్షులు మల్లికార్జున్,ఎన్ అర్ జీ ఎస్ అధ్యక్షులు వెంకట్రం రెడ్డి,డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి గోపాల్, ఉమ్మడి వరంగల్ జిల్లా టిఎన్ జీ ఓస్ నాయకులు గజే వేణు గోపాల్, హరి కష్ణ,నాగరాజు, మోయిజ్, బింగీ సురేష్, రామ్ ప్రసాద్,ఉదరు భాస్కర్,రాజేష్ ఖన్నా,లక్ష్మి ప్రసాద్,చీకటి శ్రీనివాస్,ఆకుల రాజమౌళి, రాజీవ్, కష్ణ, భరత్, శ్యామ్, అనూప్, ప్రణరు,అజీమ్,రమేష్,గోవర్ధన్,గోపి కష్ణ, ప్రవీణ్, శ్రీనివాస్, గౌతమ్,మల్లేశం,శివ తదితరులు ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.