Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాడైన రోడ్లకు మరమ్మత్తులు ఎప్పుడు..?
- వివిధ దశలలో ట్యాంకుల నిర్మాణం
- పైప్లైన్ పనులకు 'హైవే' అడ్డంకి..
- వేసవిలో పొంచి ఉన్న నీటి ఎద్దడి..!
- పట్టణ ప్రజలకు తప్పని తాగునీటి తిప్పలు
నవతెలంగాణ-నర్సంపేట
2016 ఆగస్టు 6న సీఎం కేసీఆర్ ప్రకటించిన 'మిషన్ భగీ రథ పథకం' మంచినీటికి పట్టణ ప్రజలు నేటికీ నోచుకోలేదు. ఇం టింటా శుద్ధి నీటిని సరఫరా చేయాలనే ప్రభుత్వ సంకల్పం ఏళ్లు గడిచినా ఇంకా నెరవేరలేదు. మిషన్ భగీరథ మంచినీరు ఇంటింటా అందిస్తామని ప్రభుత్వం చెబితే పట్టణ ప్రజలు సంబరపట్టారు. ఇక మాకిక కుళాయి మురికి నీటి కష్టాలు తప్పుతాయని ఆశించారు. ఇంజనీరు అధికారుల అలసత్వం..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పలు సాంకేతిక అడ్డంకులు..వెరసి పట్టణ ప్రజలకు నేటికీ మంచి నీటి సరఫరా దరి చేరలేదు.. మిషన్ భగీరథ పనులకు ఆది నుంచి అన్ని అడ్డంకులే ఎదురైతున్నాయి. ఇటీవల పైప్లైన్ పనులను జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు. పట్టణంలోని 24 వార్డుల్లో 13,756 గృహాల్లోదాదాపు 40వేల మంది నివసిస్తున్నారు. మున్సిపాలిటీకి మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.48 కో ట్ల నిధులను మంజూరు చేసింది. ఇప్పటి వరకు సుమారు రూ.32 కోట్ల నిధులను ఖర్చుచేసినట్లు ఇంజరింగ్ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 85 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంటింటానల్లాలను అమర్చలేదు..రోడ్లపై తవ్విన గుం తలకు మరమ్మత్తు చేపట్టలేదు. వివిధ శాఖల అధికారుల మధ్య స మన్వయలోపంతో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు అర్థాంత రంగా నిలిచిపోయాయి. ఫలితంగా ఈ వేసవిలోనూ పట్టణంలో తిరిగి ఎప్పట్లాగే తాగునీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమవుతుందని ప్ర జలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిర్థిష్ట గడువులోపు ప నులను పూర్తి అయ్యేలా ప్రభుత్వం, ఉన్నత ఇంజనీరు అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పనుల్లో కొరవడిన వేగవంతం..కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..
పట్టణంలో మిషన్ భగీరథ పథకం ప్రాజెక్టు పనులను పీఆర్జీ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపడుతుంది. ఇంట్రా పైప్లైన్ పనులను, ట్యా ప్లు అమర్చేే పనులను, రోడ్ల మరమ్మత్తు పనులను ఈ కంపెనీ వే ర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించింది. మల్లంపెల్లి రోడ్డు, అంబేద్కర్ సెంటర్ నుంచి పాకాల రోడ్డు, మహబూబాబాద్ రోడ్డు వైపున హైవే ఇంజనీరు అధికారులు పైప్లైన్ పనులకు ఇంకా అనుమతి ఇ వ్వలేదు. మున్సిపల్ పలు రకాల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉం డి నీటి సరఫరా కాకుండా పోయింది.ఇదిలాఉంటే పైప్లైన్ల కో సం తవ్విన కందకాలతో రోడ్లన్ని అధ్వాన్నంగా మారాయి.ఇక అంత ర్గత రోడ్లన్ని పాడయ్యాయి.నెలల తరబడినా ఇంకా మరమ్మత్తులు చేపట్టడం లేదు.రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తవ్విన కాంట్రాక్ట్ర్ ఒకరు, మరమ్మత్తులు చేసేది మరొక కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. ట్యా ప్లు అమర్చే పని మొదలెట్టలేదు.ఈ పనులు చేయనిదే మరమ్మ త్తులు చేయడం కుదరదని మరో కాంట్రాక్టర్ చేతిలెత్తేశాడు. ఈ వేస విలోనూ మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కలయేనా అంటూ ప లువురు మహిళలు విస్త్తుపోతున్నారు. ఇప్పటికైన అసంపూర్తిగా ఉ న్న నిర్మాణ పనులను వేగవంతం చేసి శుద్ధి నీటిని సరఫరా చేయా లని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణంలో ట్యాంకులు.. మెయిన్ పైప్లైన్కు అడ్డంకులు
పట్టణంలోని సర్వాపురం(కుమ్మరికుంట) మూడేండ్ల క్రితమే 500 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఓహెచ్ఆర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేశారు. శాంతినగర్లో 800 కిలో లీటర్ల ట్యాంకు, సాంఘీక సంక్షేమ గురుకులంలోని 1000 కిలో లీటర్ల ట్యాంకు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి అయింది. మున్సిపల్ కార్యాలయంలోని 600 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మాణం పూర్తి దశకు చేరు కుంది. ఇదివరకే జెడ్పీ బాలుర పాఠశాలలో, బొందబడి ఆవరణ లో, శాంతినగర్లో ట్యాంకులు ఉన్నాయి. పట్టణంలోని 24 వార్డు ల్లో 7 జోన్లుగా పరిగణించారు. ఈ ఏడు ట్యాంకుల ద్వారా 13, 756 గృహాలకు నల్లా నీటిని సరఫరా చేయాల్సి ఉంది.1,53,527 మీటర్ల పైప్లైన్ విస్తరణకు 1,31,362 మీటర్ మేరకు పైప్లైన్ పనులను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇంకా 22,165 మీటర్ల పైప్లైన్ పనులు చేయాల్సి ఉంది. హైవే అధికారులు ఇంకా ఇనుమతి ఇవ్వకపోవడం వల్ల 12,876 మీటర్ల పైప్లైన్ నిలిచిపోయింది.
మొత్తంగా 85.56శాతం పైప్లైన్ పనులు చేపట్టినట్లు అధికా రులు చెప్పారు. 13,756 గృహాలకు గానూ 7,312 నల్లా పైప్లైన్ లు వేశారు. ఇంకా ఇంటింటా నల్లాలను అమర్చాల్సి ఉంది. మరో 40రోజుల వ్యవధిలో పనులను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఎంచు కున్నట్లు మున్సిపల్ ఏఈ శాంతి స్వరూప్ తెలిపారు.
అడుగడుగునా తవ్వకాలు.. పెండింగ్లో రోడ్ల మరమ్మత్తులు
పైప్లైన్ పనులకై ప్రధాన, అంతర్గత రోడ్లు, పక్కన తవ్వకాలు చేపట్టారు.మట్టిని పడ్చినా రోడ్లపై గుంతలు అట్లాగే ఉన్నాయి. దీనివల్ల బాటసారులు, వాహనాలపై వెళ్లే వారు పలు ప్రమాదాలను ఎదుర్కొన్నారు.17.5 కిలో మీటర్ల నిడివి కలిగిన రోడ్లను తవ్వినట్లు ఇంజనీరులు పేర్కొన్నారు. ఇందులో 3.293 కిలో మీటర్ల రోడ్లను మాత్రమే మరమ్మత్తులు చేసినట్లు చెప్పారు.ఇంకా 14.21 కిలో మీటర్ల మేరకు మరమ్మత్తులు చేయాల్సి ఉంది.
ఇదిలాఉండగా పట్టణంలోని ఇంటింటా నల్లా కనెక్షన్ ఇవ్వడా నికి రోడ్లకు ఇరువైపల పైప్లైన్ వేయాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా ఒకే వైపున పైప్లైన్ వేయడం వల్ల మరో వైపు ఉన్న ఇండ్లకు నల్లా కనెక్షన్ కోసం రోడ్డును అడుగడుగునా పగల కొట్టారు. దీంతో ఇంకా రోడ్లన్నీ గుంతలు పడ్డాయి.పలు వార్డులలలో ఏకంగా సీసీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. కాంట్రాక్టర్ ఈ రోడ్లన్నింటిని శాశ్వత పద్ధతిలో పక్కగా మరమ్మత్తులు చేయాల్సి ఉంది.ట్యాంకుల నిర్మాణా లు, పైప్లైన్ పనులు పూర్తి అయితే తప్పా నల్లాలు బిగింపు, రోడ్ల మరమ్మత్తులు చేయలేమని ఏఈ తెలిపారు. ఏప్రిల్ 31 నాటికి ప నులన్నీ పూర్తి చేయడానికి తగు చర్యలు చేపడుతామని మున్సిపల్ ఏఈ శాంతి స్వరూప్ తెలిపారు.