Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ నగరంలో అడుగడుగున ట్రాఫిక్ పోలీసులు అడ్డాలు వేసి రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులను ఆ పి హెల్మెట్,వివిధ సర్టిఫికెట్లు లేదన్నసాకుతో ట్రాఫిక్ నియం త్రణ చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టి నగరంలో చలాన్ల బా దుడు సర్వసాధారణమైపోతుంది. ఇరువైపుల వస్తున్న వాహ నాలు అపడంలాంటి చర్యలతో ట్రాఫిక్ అంతరాయం కలు గుతుందని పలువురు అనుకుంటున్నారు. కొంతమంది పోలీ సులు అధికారులు వాహనాన్ని చాటు మాటు గా ఎవ్వరికీ కనబడకుండా పెట్టుకొని రోడ్డుపైన నిలబడి వాహనదారుల ను ఆపిమరి చలాన్లు కొట్టి పంపిస్తున్నారు. ఇది ఏమిటి అని పలువురు వాహనదారులు అడిగితే అదిఅంతే అని కొంత మంది ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా అనారోగ్య పరి స్థితుల్లో ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో చెప్పిన వినకుండా నిర్ధాక్షీణ్యంగా వాహనాల తనిఖీలు, చాలన్ల పేరుతో కఠినం గా వ్యవహరించడంపట్ల పలు వాహనదారులు ఇది ఏమిట ని అనుకునే వారులేకపోలేదు. వాహన దారులు అపే క్ర మంలోఅకస్మాత్తుగా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు వాహ నాలకు ఎదురుగా రావడం వలన వాహనాలు ఆపే క్రమం లో వాహనదారులు వాహనం నియంత్రణ చేసుకోలేక ఎదు రుగా వచ్చిన కానిస్టేబుల్ కు ప్రమాదం జరిగితే,లేదా వాహ న దారులు కింద పడి ప్రమాదం జరిగిన బాధ్యత ఎవరు వ హిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జంక్షన్ల మధ్య ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చూడాల్సింది పోయి చలాన్లబాదుడే లక్ష్యంగా పెట్టుకొని వచ్చిన ప్రతివాహనానికి చలాన్లు వేసి పంపిస్తు న్నా రని ఆరోపణలు లేకపోలేదు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మె ట్, పొల్యూషన్ అని పలుకారణాలు చూపుతూ చలాన్లు వే యడం వలన వానదారులు రోడ్డుపైకి రావాలంటే వాహన దారులు బెంబేలెత్తుతున్నారు. కొంతమంది ట్రాఫిక్ పోలీసు లు వాహనదారులు వెళ్తుంటే వెనుకనుండి ఫోటోలు తీసి మరి చలాన్లువేయాలనే ఉద్దేశంతో ఉంటున్నారా అనే అను మానం వ్యక్తం అవుతున్నాయి. కానీ వరంగల్ పోస్ట్ ఆఫీస్ వరంగల్ బట్టల బజార్ కాశిబుగ్గ పోచమ్మ మైదాన్ వంటి పలుప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే కొంతమంది ట్రాఫిక్ పోలీసులు తమ సొంతపనుల నిమిత్తం, కొన్ని జం క్షన్లలో ఉండకుండా గాలికి వొదిలేసి ప్రక్కన ఉన్న షాపుల్లో కూర్చుని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం,మరి కొంత మంది సెల్ ఫోన్లు చూస్తూ ఉంటున్నారే తప్ప ట్రాఫిక్ అంత రాయం కలిగినప్పుడు కనీసం బాధ్యతగా విధులు నిర్వర్తిం చడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సంఘటలను చూస్తే కొంత మంది ట్రాఫిక్ పోలీసులు తీరు ఎప్పుడు మారుతుందో వాహన దారులు అనుకుంటున్నారు. ఏదేమైనాప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా లని వాహనదారులు గుసగుసలాడుకుంటున్నారు.
ఇష్టానుసారంగా చలాన్లు వసూలు : యశ్వంత్, కాశీబుగ్గ
వాహనాన్ని బయటికి తీయాలంటే భయం వేస్తున్న ది,అడుగడుగునా ట్రాఫిక్ పోలీసులు చలనాల పేరుతో బలవంతంగా వసూళ్లు చేస్తున్నారు.ఆరోగ్యం బాగా లేక ఆ సుపత్రికి పోతున్నాం అనిన వినకుండా పెండింగ్ చాలన్లు కట్టాల్సిందే అని ట్రాఫిక్ పోలీస్లు అనడం చాలా బాధ అనిపించింది. ఒక దిక్కు ప్రాణం పోతుంది అంటే ట్రాఫిక్ పోలీసులు చలానలు కట్టి వెళ్లాలి అంటున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి కి వెళ్ళే వారికి కొంత సడలింపు ఇవ్వాలి.