Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్
నవతెలంగాణ - హన్మకొండ
విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం చే రుకుంటారని కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల పాఠశాల వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, వరంగల్ డీసీపీ మహమ్మద్ అబ్దుల్ బారి, వడుప్సా హనుమ కొండ అధ్యక్షుడు మాడాల సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీ సే ప్రయత్నమే ఈ కార్య క్రమం అన్నారు. ప్రతి వి ద్యార్థి మొదటి గురువు త ల్లిఅని అన్నారు. మహమ్మ ద్ అబ్దుల్ బారి ప్రసంగి స్తూవిద్యార్థులు మొబైల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటూ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి సమయ పాలన పాటించినట్ల యితే నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకంటారని తెలియజేశారు.
వడుప్సా ప్రెసిడెంట్ మాదాల సతీష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే నీతి కథలు బోధించడం ద్వారా వారిలో ఉన్న సుగుణాలు మ రింత మెరుగుపడతాయని.. తద్వారా ఎన్నో విజయా లను అలవోకగా సాధించగలరని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథులను పాఠశాల యాజమాన్యం జ్ఞాపికలతో సత్కరించారు. అనం తరం జాతీయ గణిత ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో, రాష్ట్రస్థాయి ర్యాంకులు, క్రీడా విభాగంలో ప్రతిభను కనబరిచిన పాఠశాల విద్యార్థులను ఘనంగా సత్క రించారు. అతిథులుగా విచ్చేసిన శ్రీనివాస్ ఇంద్ర మాట్లాడుతూ శ్రీనివాస్ గురుకుల్ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్లో విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యా ర్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని తెలుపుటకు ఎంతో గర్విస్తున్నామని తెలియజేశారు.
శ్రీనివాస్ గురుకుల్ స్కూల్ కరస్పాండెంట్ చిదురాల సోమరత్నం మాట్లాడుతూ ఈ కార్యక్ర మంలో పాల్గొని విజయవంతం చేసిన ముఖ్య అతిథు లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే ప్రదర్శించిన సాం స్కృతిక కార్యక్రమాలు అతిథులను ఎంతగానో అలరించాయి.