Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల పరిధిలోని గ్రామాలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధ వారం ఆలయాల్లో ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. శాయం పేటలోని శివమార్కండేయ వెంకటేశ్వరస్వామి ఆలయాలలో, శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయంలో, పెద్దకోడెపాకలోని రాజరాజేశ్వరాలయంలో ఉదయమే మహాగణపతి పూజ, మహన్యాస రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని తయారుచేసి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలుగా పంచి పెట్టారు. అనంతరం ఆయా ఆలయాల అర్చకులు మార్త రాజ్ కుమార్, ఆరుట్ల కృ ష్ణమాచార్యులు, అనుదీప్ శర్మలు శ్రీ శోభకత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లు బాసాని సూర్య ప్రకాష్, సా మల బిక్షపతి, గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సేనారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలం లోని వడ్లకొండలో శుభ కతు నామ సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గుట్ట పైన జరిగే శ్రీ రంగనాయకుల స్వామి వారి జాతరలో భాగంగా స్వామివారికి స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పలయ్య, మరియు రంగనాయకుల స్వామి భక్తులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొ న్నారు. అలాగే మండలం లోని ఆయా గ్రామాల దేవాలయాల్లో ఉగాది వేడుకలలో బాగంగా పంచాంగ శ్రవణంలో వారి వారి రాశి ఫలాలు తెలుసుకున్నారు.
కాజీపేట : శుభకృత్ నామసంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు నివాసంలో కుల మతాలకు అతీ తంగా డివిజన్లోని ముస్లిం మైనారిటీలతో కలిసి ఉగాది పండుగ జరుపుకున్నా రు. అనంతరం ముస్లింలకు ఉగాది పచ్చడి అందించారు. ఈ సందర్భంగా నర్సిం గ్రావు మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో తెలుగు నూతన సంవత్సరం సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ సోనీ, టైగర్ యూత్ సభ్యులు ముస్తాక్ బారు, ఇబ్రహీం, సత్తార్, గౌస్, బాబారు, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు స్వగహంలో ఉగాది పండుగ ఉత్సవాలు మండల బిఆర్ఎస్ నాయకుల సమ క్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఎంపీపీ నివాసంలో ఏర్పాటు చేసిన షడ్రుచుల సమ్మేళనం కలగలి సిన ఉగాది పచ్చడిని పండుగలో పాల్గొన్న అందరికీ పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖానాపురం మండ ల ప్రజలు సుభిక్షంగా, యరోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో కలకాలం ఉండాలని, సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందాలని, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట అభివద్ధిలో ముందుకు సాగాలని కోరారు.సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకష్ణ,ఉప సర్పంచ్ మేడిద కు మార్, సొసైటీ డైరెక్టర్ నీలం సాంబయ్య, రైతుబందు జిల్లా కమిటీ సభ్యులు బొ ప్పిడి పూర్ణచందర్ రావు,మాజీ సర్పంచ్ తక్కలపెళ్లి రమేష్,సోషల్ మీడియా మం డల కన్వీనర్ దాసరి రమేష్,గ్రామపార్టీ అధ్యక్షుడు మచ్చిక అశోక్ గౌడ్,గ్రామ కో-ఆప్షన్ సభ్యులు మాల్యాల పోశెట్టి,రెడ్డి నాగార్జున రెడ్డి,నాయకులు మర్రి రామ స్వామి, పంతిని వెంకన్న,గంగాపురం అనిల్,మానపెల్లి వెంకన్న,యార్లగడ్డ గాంధీ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
నల్లబెల్లి : మండల కేంద్రంలోని హనుమ దేవస్థానం ప్రాంగణంలో గల వాగ్దేవి యువజన కళా సంస్థ వేదికపై బుధవారం తెలుగు సంవత్సరాది శ్రీ శుభకత్ నామ సంవత్సర (ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీ శోభకత నామ సంవత్సరానికి సంబంధించిన ఉగాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వివిధ రాశుల వారి ఆదాయం, ఖర్చులు, రాజపూజ్యం, అవమానానికి సంబంధించిన విషయాలను పురోహితులు కొండ కష్ణస్వామి, తిరునాహరి సత్యనారాయణ స్వామి క్షుణ్ణంగా పంచాంగ శ్రవణం తెలియజేశారు. అనంతరం గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశం యొక్క జాతక విషయాలను గురించి వివరించారు. అనంతరం రాశుల వారి విధంగా కొత్త సాలు విషయాలను తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నానాబోయిన రాజారాం, ఉపసర్పంచ్ లత నాగేశ్వరరావు, గ్రామ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఉడుత రాజేందర్, బత్తిని మల్లయ్య, మంద రాజన్న గుండాల శ్రీశైలం, భోగ భద్రయ్య,సామల లక్ష్మీనారాయణ, గ్రామ కుల పెద్దలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.