Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
జన విజ్ఞాన వేదికలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో తనరచనలతో జనజాగతం చేస్తున్న ధర్మప్రకాష్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. బుధ వారం ఎన్జీవోస్ నెట్వర్క్ సౌజన్యంతో విశ్వ శ్రీ ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఉగాది జాతీయ పురస్కారాల వితరణ సమావేశంలో కళా ప్రపూర్ణ డాక్టర్ బిక్కి కష్ణ, పాఠశాల విద్య డిప్యూటీ డైరెక్టర్ గురుమూ ర్తి చేతులమీదుగా ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ధర్మ ప్రకాష్ ఉ గాది జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ రంగా ల్లో పనిచేస్తున్న వ్యక్తులకు ఈ అవార్డులు అందజేయగా జన విజ్ఞాన వేదికలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ పర్యా వరణ పరిరక్షణలో తన రచనలతో జనజాగతం చేస్తున్న ధర్మప్రకాష్కు అవార్డు అందజేస్తున్నట్లు గురుమూర్తి తెలియ జేశారు. ఈ సందర్భంగా ధర్మ ప్రకాష్ మాట్లాడుతూ పర్యావ రణ పరిరక్షణకు నా జీవం ఉన్నంతవరకు నా రచనలతో పాటుగా, ప్రతి వ్యక్తినీ మేలుకొలుపే విధంగా నా వంతు కషి చేస్తానని అన్నారు. నన్ను గుర్తించి, నాకు ఈ పురస్కారాన్ని అందించడం చాలా సంతోషకరంగా సంతప్తిగా ఉందన్నా రు. కార్యక్రమంలో నరసింహప్ప, కస్తూరి శ్రీనివాస్, జీవన్ లాల్ అవాడీయా, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, డివి రాజగోపాల్, మేడిది సత్యనారాయణ రావు, ప్రొఫెసర్ దేవన్న, రాజా వాసుదేవరెడ్డి మల్లీశ్వరి, యశోద పెను బాల, కళ తాటికొండ, మంజుల సూర్య తదితరులు పాల్గొన్నారు.