Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డిసిఈబి సెక్రటరీ, మండల నోడల్ ఆఫీసర్ గారె కష్ణమూర్తి అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి ఆదేశాల మేరకు మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలను, మిడే మిల్స్ నిర్వహ ణను పరిశీలించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ పది జీపీఏతో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దష్టి సారించాలి అని సూచించారు. సబ్జెక్టుల వారీగా వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ఆ యా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో బోధన చేయాలని తెలిపారు. వి ద్యార్థులకు సులభ పద్ధతులో బోధించాలని పేర్కొన్నారు. గణితం, సైన్స్ తదితర క్లిష్టతరమైన సబ్జెకుల్లో అర్థమయ్యేలా పాఠ్యాంశాలను చెప్పాలన్నారు.
ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు రూపొం దించి పరీక్షలు నిర్వహించాలని కోరారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయనతోపాటు ప్రధానోపాధ్యాయుడు వేణు, ఉపాధ్యాయులు శేఖర్, సు రేందర్, మురళి తదితరులు ఉన్నారు.