Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు పరదాలు ఇవ్వని అధికారులు
- వర్షంతో తడిసిన మిర్చి
- కార్యదర్శి హామీతో ఆందోళన విరమణ
- పత్తాలేని మార్కెట్ కమిటీ పాలకవర్గం
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు సుమారు రెండు గంటలసేపు ధర్నా నిర్వహించారు. దీనితో సుమారు కిలోమీటర్ పొడవున వాహనాలు ఎక్కడికక్కడే నిలిచాయి. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు గురువారం రైతులు పెద్ద ఎత్తున మిర్చి తీసుకువచ్చారు సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మార్కెట్లో ఉన్న మిర్చి బస్తాలు తడిచాయి దీనితో వ్యాపారులు క్వింటాకు రూ.15 వందల నుండి 2వేల వరకు ధర తగ్గించడంతోపాటు బస్తాకు ఐదు కిలోల తరుగు తీయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులందరూ మార్కెట్ ప్రధాన గేటు ముందు ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న విషయం మార్కెట్ అధికారులకు పాలకవర్గానికి తెలిసినప్పటికీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్ కు మిర్చి పెద్ద ఎత్తున వస్తున్న రైతులకు కావలసిన కనీస ఏర్పాట్లు చేయలేదని అన్నారు. గతంలో వర్షం వస్తే రైతుల ధాన్యం తడవకుండా తగినన్ని పరదాలు ఇచ్చేవారని కానీ ఇప్పటి పాలకవర్గ సభ్యులు గానీ, అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు వారి అసమర్ధత వల్లే మిర్చి బస్తాలు తడిచాయని అన్నారు. మిర్చికి ధరలు అయినప్పటికీ ఇంకా కాంటాలు పెట్టలేదని, సాయంత్రం కురిసిన అకాల వర్షాల వల్ల అధికారులు ధరలు తగ్గించడంతో పాటు, బస్తాకు ఐదు కిలోల చొప్పున తరువు తీయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇదే విషయంపై తాము ప్రశ్నిస్తే మీకు ఇష్టమైతే అమ్ముకోండి లేదా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోండి ఇంటికైనా తీసుకెళ్లండి అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చివరికి మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి బివి రాహుల్ రైతులతో మాట్లాడి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కానీ పాలకవర్గ సభ్యులు గానీ ఇటువైపు తొంగిచూసిన పాపాన పోలేదు.
సకాలంలో పరదాలు ఇవ్వలేదు : మల్లయ్య, భూపాలపల్లి జిల్లా
మార్కెట్ అధికారులు సకాలంలో పరదాలు ఇవ్వకపోవడం వల్లనే మిర్చి బస్తాలు తడిచాయి. ఈరో జు కొత్త సాలు అని రైతులు పెద్ద ఎత్తున మిర్చిని తీసు కువస్తే అధికారులు ధరలు తగ్గించి కొనుగోలు చేశారు. సాయంత్రం కురిసిన చిన్నప్పటి వర్షానికి బస్తాకు 5 కిలోల తరుగుతోపాటు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తా మన్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మకానికి తీసుకువస్తే వ్యాపారులు అధికారులు కలిసి రైతులను దోచుకుంటున్నారు.