Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రతి ఒక్కరు శుద్ధి చేసి న స్వచ్ఛమైన త్రాగునీరు మాత్రమే తాగాలని మారి సంస్థ కోఆర్డినేటర్ కష్ణమూర్తి అన్నారు. ప్రపంచ నీటి దినో త్సవం' సందర్భంగా విద్యా ర్థిని విద్యార్థులకు రన్నింగ్, క్విజ్, చిత్రలేఖనం,పరుగు పం దెం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గు రువారం వర్ధన్నపేట ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పసు నూరి నర్సయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యఅతిథిగా చేత బహు మతి ప్రధానోత్సవం చేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మారి సంస్థలో కోఆర్డినే టర్ రాగి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ, మానవ శరీరానికి అదే ముఖ్యమైనది నీరు అ న్నారు. స్వచ్ఛమైన నీటిని తాగడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూ చించారు అనారోగ్యం సమస్యల బారిన పడకుండా విద్యార్థులు వారి కుటుంబ స భ్యులకు స్వచ్ఛమైన నీటిని మాత్రమే సేవించాలని సూచించాలని కోరారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎస్ఎంసి చైర్మన్ బాల్యరమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో ఇలాంటి ఫోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా వుందని, ఇలాంటి సృ జనాత్మక కార్యకలాపాలకు ప్రభుత్వేతర సంస్థలు సహకరించడం వలన ప్రభుత్వ పాఠశాలల బలో పేతానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్ర ధానోపాధ్యాయులు నరసింహమూర్తి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐజల్వాటర్ ప్లాంట్ యజమాని తోటరాజు, సేఫ్ వా టర్ విజయలక్ష్మి, శ్యాంసుందర్, పాఠశాల ఉపాధ్యాయునీలు భ్యూల, రాజకుమారి, అనిత, విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.