Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీలో హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-కాజీపేట
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ అవకాశాల ను సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని హను మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. కాజీ పేట మండలం మడికొండలోని దుర్గాబాయి మహి ళా శిశు వికాస కేంద్రం నందు శిక్షణ పొందిన మహి ళలకు జిల్లా అధికారిని పి.జయశ్రీ ఆధ్వర్యంలో సర్టిప ˜ికెట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ స్నిక్త పట్నాయ క్ హాజరైజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం జిల్లా అధికారిని పి.జయశ్రీ శిక్ష ణ కేంద్రంలో మహిళల కొరకు అందించే కోర్సులు, శి క్షణ పొంది ఉద్యోగాలు సాధించిన మహిళల కొరకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నిక్త పట్నా యక్ మాట్లాడుతూ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రారంభం నుండి నేటి వరకు పదివేల మం ది మహిళలకు పైగా శిక్షణ ఇవ్వడం శిక్షణ పొందిన వారిలో 8వేల మందికి పైగా ఉపాధి పొందడం అభి నందనీయమన్నారు. మహిళలు ఆర్థికంగా నిలబడా లని ఉద్దేశంతో మహిళా ప్రాంగణం ఏర్పాటు చేయ డం సంతోషమన్నారు. రెండున్నర నెలల పాటు మ హిళా సెక్యూరిటీ సూపర్వైజర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉద్యోగంలో చేరే పత్రం, ప్రాథమిక వైద్య చికిత్స రెండవ సంవత్సరం శిక్షణ పొందుతున్న మ హిళలకు, మొదటి సంవత్సరంలో శిక్షణకు హాజరైన మహిళలకు కీట్లుపంపిణీ చేయడం జరిగింది అన్నా రు. ప్రాథమిక వైద్య చికిత్స నర్సు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు అబ్రాడ్స్ వెళ్లే అవకాశాలు లభించడం గర్వించే విషయం అన్నారు. అవకాశాలను సద్విని యోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
అనంతరం పి.జయశ్రీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో మహిళల కొరకు పలు కోర్సులలో శిక్షణివ్వడం జరుగుతుందని భవిష్యత్తులో మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలా గే హిజ్రాలకు ఉపాధి కల్పించ డం కొరకు అతిత్వరలో శిక్షణకోర్సుప్రారంభించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిపారు. శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందు తున్న మహిళలకు అన్ని వసతు లతో శిక్షణ అందిస్తు న్నట్లు, రూ.75 లక్షల వ్యయంతో ప్రాంగణ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మహిళలు ప్రతి అవ కాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తికర కోర్సులలో శిక్షణ పొంది ఆర్థికంగా ఎదగాల న్నారు. ఈ కార్యక్ర మంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆకవరం శ్రీనివాస్ కుమార్, కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్, బొల్లికొండ వినోద్ కుమార్, మహిళలు పాల్గొన్నారు.