Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం వరంగల్, హన్మకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-వరంగల్/ హనుమకొండ
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీ అంశం పై సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని వరంగల్ జి ల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య , సిపిఎం జిల్లా కన్వీ నర్ బోట్ల చక్రపాణిలు అన్నారు. నిరుద్యోగులకు న్యా యం జరగాలని పార్టీ పిలుపు మేరకు వేరువేరుగా ని ర్వహించిన ర్యాలీ, నిరసన కార్యక్రమాల్లో ముఖ్య అ తిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో హాస్టల్లో ఉంటూ కోచింగ్‌లకు లక్షల రూపాయల ఖ ర్చుపెట్టి ఎంతోకష్టపడి చదివి పరీక్షలు రాసిన నిరు ద్యోగులకు ఈ ఘటన తీవ్ర నష్టం, మనస్థాపానికి గు రి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్1 ప్రిలీమ్స్, ఇతర పరీక్షలను రద్దు చేసి నిరుద్యోగుల జీ వితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అభ్య ర్థుల తల్లి తండ్రులు అప్పులు చేసి పిల్లలను కోచింగ్ పంపించి చదివిస్తే, పరీక్షలు రాశాక ఇప్పుడేమో ప్రభు త్వం పేపర్ లికేజ్ అని పరీక్షలు రద్దు చేసారని, ఇదే మి న్యాయం అన్నారు.
రాష్ట్ర మంత్రి ఏమో ఒక్కరు ఇ ద్దరు చేసినతప్పు వలన ఇలా జరిగిందనడం సిగ్గుచే టు అన్నారు. టీఎస్పీఎస్సీ నియామకాల విషయం లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ,కమిషనర్, కార్యదర్శి మొత్తం సభ్యుల పాత్ర పైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై విచారణ ఏర్పాటు చేయబడ్డ సిట్ 8 మందిని నిందితులను రిమాండ్‌కు పంపడం వి చారణ జరుగుతుంటే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డుపై అనేక అను మానాలు వ్యక్తమవుతున్నాయని డిపార్ట్ మెంట్ వ్యవ హారాలు పరీక్షపేపర్లు,కీలకమైన పాస్వర్డ్ కమిషనర్ లేదా చైర్మన్, సెక్రటరీలకు మాత్రమే పాస్వర్డ్ తెలు స్తుంది కానీ సెక్షన్‌ఆఫీసర్ ఇంత కీలక మైన పేపర్ల ను ఫోటో తీసుకున్నాడంటే అక్కడవాటి భద్రత కల్పిం చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థ మవుతుంద న్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిందితు లను కఠినంగా శిక్షించి నిరుద్యోగులకు న్యాయం చే యాలని డిమాండ్ చేశారు.
అంతరం మాలోతు సాగర్ మాట్లాడుతూ చైర్మైన్ జనార్దన్‌రెడ్డి, సర్వీస్ కమీషన్,కమిటీ సభ్యులను తొల గించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని,పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరపాలని డివ ూండ్ చేశారు. లికేజీ విషయంలో ఎవరు ఉన్న వ దిలి పెట్టవద్దు అన్నారు. తప్పులు చేసిన వారిని శిక్షించాలి కానీ ఎన్నో సంవత్సరాలనుండి కష్టపడి చదివి క్వాలిఫై అయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటని క్వాలిఫై అయిన అభ్యర్థుల అందరికి న్యాయం చెయ్యాలని అన్నారు.అంతరం నలిగంటి రత్నమాల మాట్లా డుతూ టీఎస్పీఎస్సీ పొరపాటు వలన 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడం సరైనది కాదన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వైఫల్యం వలననే ఇలా జరిగిందని, లక్షలు మంది జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదన్నారు. లేనిపక్షంలో సీపీ ఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దపోరాటాలు నిర్వహిస్తామ ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమాల్లో వరంగల్, హన్మకొండ జిల్లాల సిపిఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు ఎండి భషీర్, ఎం. చుక్కయ్య, వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, మందసంపత్, నాయకులు తొట్టె మల్లేశం, డి. భాను నాయక్, నోముల కిషోర్,అకినపెళ్ళి యాదగిరి, రంగ శాయిపేట ఏరియా కమిటి సభ్యులు గణేపాక ఓదె లు, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, జన్ను సురేష్, రమేష్, కల్పన, సుస్మిత, పాష, సుమన్, సునీ త, సీపీఎం హన్మకొండ అలీ,కుమారస్వామి, రా జేందర్, వెంకట్, కావ్యశ్రీ, శ్వేత, సుకర్ణ, ప్రేమలత తదిత రులు పాల్గొన్నారు.