Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని అన్నారం షరీఫ్‌లో సర్వే నెంబర్ 488, 48 9లో గల భూములలో లబ్ధిదారు లకు తెలియకుండానే అక్రమం గా పట్టా చేసుకున్న వ్యక్తులపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ కు వినతి పత్రం అం దజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1972 లో కొంత మంది దళితు లకు అసైన్డ్ భూములను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.అట్టి భూములలో 6 గుంటల భూమిని అన్నారంషరీఫ్ గ్రామానికి చెందిన కూరపాటి సోమయ్య, వెంక టేశ్వర్లు, ఎండి నర్సింగం,పి.యాకేశ్వర్లు, అనబత్తుల కేదారిలు దళితులకు ఎలాం టి సమాచారం లేకుండానే సాదాబైనామా లో పేర్లు అక్రమంగా పట్టా చేసుకున్నా రన్నారు. వీరిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధిత దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.ఆయన తో పాటు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పోడేటి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.