Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రైతుల వేడుకోలు
నవతెలంగాణ-తొర్రూరు
మీ వల్లే... నీళ్ళు మీ వల్లే... కరెంటు మీ వల్లే... రైతు బంధు మీ వల్లే... రైతు బీమా మీ వల్లే... ఈ పంటలు మీ వల్లే... పంటల కొనుగోలు మీ వల్లే కావాలి... ఈ పంటల నష్ట పరిహారాలు అని గురువా రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పెద్ద వంగర మండలం రెడ్డి కుంట తండాకు వచ్చిన ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు పలువురు రైతులు విన్నవించు కున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ మనమే మన ఖాజానాల కేలి.. ఎకరానికి రూ. 10వే లు నష్టపరిహారం ఇచ్చుకోవాలె...రైతులకు భరోసా నింపుతూ, ధైర్యం చెబుతూ... కెసిఆర్ నష్టపోయిన పంటలను పరిశీలించారు. సార్, మీ వల్లే... నీళ్ళ వ చ్చినయి. మీ వల్లే... ఈ 24 గంటల కరెంటు వస్తుం ది. మీ వల్లే...మాకు రైతు బంధుపడ్తాంది. మీ వల్లే... రైతు బీమా వస్తాంది. మీ వల్లే... ఇన్ని ఈ పంటలన్నీ పండుతానయి. చివరకి మీ వల్లే... పంటల కొను గోలు జరుగుతాంది. లేకపోతే రాష్ట్రంల రైతు దిక్కు మాలిన చావే దిక్కయ్యేది. సార్, ఇగ మీ వల్లే గీ పం టల నష్టాల పరిహాలు కూడా ఇయ్యాలె... అంటూ పలువురు రైతులు సిఎం కెసిఆర్‌కు విన్నవించుకున్నా రు. దానికి ప్రతిగా రైతులకు కుశల ప్రశ్నలు వేసి, ఏం పేరు? ఎంత వేసినవు. పెట్టుబడి ఎంతైంది? నష్టం ఎంత జరిగింది? అంటూ ఆరా తీసిన సీఎం కెసి ఆర్... ఆ దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఏకానా ఇవ్వ దు మనకు.. మనమే మన ఖాజానాల కేలి.. ఎకరాని కి రూ.10వేలు ఇచ్చుకోవాలె. మూడు వేలే ఇస్తరు. కానీ మీకు నష్టం ఎక్కువ జరిగింది కాబట్టి, ఎకరాకు 10వేలు ఇస్తం. అది కూడా వెంటనే అందేటట్లు చేస్త. ఇమీడియట్గా అధికారులకు చెబుతా.మీరు మాత్రం అధైర్య పడొద్దు, ధైర్యంగా ఉండండి.ఈపంటలు సరే, వచ్చే పంటల గురించి ఆలోచించండి. అంటూ సీఎం కెసిఆర్ పంటలు నష్టపోయిన రైతులకు మనోధైర్యా న్ని నింపారు. నేనున్నాననే భరోసానిచ్చారు. మహ బూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలంలోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్ట పోయిన పంటలను సిఎం పరిశీలించారు.
గంటల్లోనే పరిహారం జీవో జారీ
పంట నష్టాల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత ని రాడంబరంగా ప్రవర్తించారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు తన పర్యటన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మూడు ఉమ్మడి జిల్లాల మీదుగా జరి గింది. ఎక్కడా భోజనం, టీ, స్నాక్స్ వంటి విరామా లకు తావివ్వలేదు. తన బిజీ షెడ్యూల్లో కొద్దిపాటి విరామాన్ని కల్పించుకునితాను ప్రయాణించిన బస్సు లోనే మిగతా మంత్రులు, వెంట వచ్చిన ప్రజాప్రతి నిధులు, అధికారులతో కలిసే తిన్నారు.ఈ సమయం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీ ణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయా కర్ రావు స్వయంగా సీఎంకి, మంత్రులు, అధికారు లందరికీ వడ్డించారు. అలాగే నేరుగా వీలైనంత రాజ కీయాంశాలు తగ్గించేసి, నేరుగా రైతులతోనే మాట్లా డి, వేదికల వద్ద రైతులనుద్దేశించి పరిమితంగా, సూటిగా పరిహారానికి సంబంధించి మాత్రమే ప్రసం గించారు. దీంతో సీఎం సభలు అంటే చాలు సహ జంగా ఉండే హంగు, ఆర్భాటాలు, హడావుడి ఎక్కడా కనిపించలేదు.
మొత్తానికి సిఎం హైదరాబాద్ చేరేలోగానే ఎక రానికి రూ.10వేల పంటల నష్ట పరిహారానికి సం బంధించిన జీవోని జారీ చేయించారు. ఇచ్చిన మాట ను నిలుపుకుంటూ, గంటల్లోనే జీవో జారీ చేయడం తో పంటలు నష్టపోయిన రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లవిరిస్తున్నాయి.