Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు దేవదానం
నవతెలంగాణ-లింగాలగణపురం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మంచినీటి సరఫరా చేయాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు దేవదానం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని కళ్లెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కెవిపిఎస్ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ కార్య దర్శి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్లో నిర్మించి ఏండ్ల గడుస్తున్నప్పటికీ ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు పంచకుం డా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.ఇండ్లు లేని నిరుపేదలు డబల్ బెడ్రూంలో నివసిస్తుండగా మంచినీటి సరఫరా నిలిపివేయ డం దురదృష్టకరమన్నారు. విద్యుత్ సరఫరాను కూడా తొలగించడం సరైన కాద న్నారు. ఇండ్లలో తలదాచుకుంటున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి వారి పట్ల మానవత్వం లేకుండా నీటి సరఫరా కరెంటును నిలుపుదల చేయడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడము నీచమైన చర్యలని మండి పడ్డారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి నీటి సరఫరా, కరెంటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన సిపిఎం మండల కార్యదర్శి కరుణాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.