Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధా నాలతో యువత, నిరుద్యోగులు, మహిళ లు, రైతులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్ర జలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెర వేర్చలేదని, ప్రజలు తగిన సమయంలో త గిన విధంగా గుణపాఠం చెబుతారని మా జీ శాసన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం త న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన పలువురు నాయకులతో కలిసి మా ట్లాడారు. టిఎస్ పిఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన అన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, చైర్మెన్, కార్యదర్శిని విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయన్నా రు. ప్రజల దృష్టి మరల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీ న్మార్ మల్లయ్య అరెస్ట్ లాంటి నాటకాలను ఆదుతోం దని విమర్శించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సంవత్సరాల తరబడి కష్టపడ్డ యువత ఆశలను నిర్వీ ర్యం చేస్తున్న ఘనత కెసిఆర్‌కు దక్కుతోందన్నారు. రైతులకు సంబంధించి అన్ని రకాల సబ్సీడీలను ఎత్తి వేయారని ఆరోపించారు. అకాల వర్షాలకు నష్టపో యిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమకు సేవ చేసేందుకే ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారనే విషయాన్ని మర్చిపోయారన్నారు.
వర్గాలేవి లేవు.. ఉన్నదంతా కాంగ్రెస్సే
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ లో వర్గాలంటూ ఏవి లేవని, ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని చెప్పారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ద్వారానే తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, తా మిద్దరం ఒక్కటేనని పేర్కొన్నారు. నాయ కులు ప్రజలను కలుసుకొని వారి కష్టసు ఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే రాహూల్ గాంధీ భారత్ జోడోయాత్రను చేపట్టారని, ఆ యాత్రకు కొన సాగింపుగా తాము కూడా స్థానికంగా హాత్ సే హాత్ పాదయాత్రను నిర్వహిస్తున్నామని, ఈనెల24న పట్ట ణంలో పాద యాత్రను నిర్వహించి చౌరస్తాలో సమా వేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశం లో మాజీ ఎంపిపి ధర్మ గోవర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, నర్సింగరావు, మోటె శ్రీనివాస్, సిద్దారెడ్డి పాల్గొన్నారు.