Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఏ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక రోజు ముందుగానే విపక్ష నాయకులను పోలీ సులు అదుపులో తీసుకొని నిర్బంధించడం ఏరకమైన ప్రజా స్వామ్యమని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. ముఖ్యమంత్రి లేదా మంత్రుల పర్య టన అడ్డుకుంటామని ఏ రాజకీయ పార్టీలు ప్రకటించకపో యినా విపక్షాల నాయకులను, కార్యకర్తలను 24 గంటల ముందే అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధించడం అన్యాయమ ని ఆయన అన్నారు.గురువారం ముఖ్యమంత్రి మహబూబా బాద్ జిల్లా పెద్దవంగర మండలంలో పంటల నష్టాన్ని పరి శీలించడానికి వస్తున్న సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే మదార్, బయ్యారం సొ సైటీ మాజీ చైర్మన్ రామగిరి బిక్షం, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు దొడ్డి తిర్మలేశ్, పీడీఎస్యూ జిల్లా నాయకులు ఎం.మహేష్ కుమార్, మద్దివంచ సర్పంచ్ కుసిని బాబు రావులతో పాటు వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది ని ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్లలో నిర్బంధించారని, వారందరినీ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే నాలుగు జిల్లాలలో ఇ లాంటి ముందస్తు అరెస్టులు చేశారని ఇది ప్రజాస్వామ్య వ్య తిరేక చర్య అని, ప్రజాస్వామ్యమా, నియంతత్వమా అర్థం కావటం లేదని అన్నారు. రాజ్యాంగ హక్కులను, చట్టాలను కాలరాస్తూ ముందస్తు అరెస్టులకు పాల్పడడం కేసీఆర్ ప్రభు త్వానికి అలవాటుగా మారిందని ఆయన అన్నారు. భవిష్య త్తులో ఇలాంటి ముందస్తుఅరెస్టులకు పాల్పడకుండా న్యా య వ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ అసమర్థ పాలనను తీవ్రంగా ఖండించండి
మండలంలోని కాంగ్రెస్ నాయకులను దౌర్జన్యంగా ముందస్తు అరెస్టు చేసిన పోలీసుల పై మండల కాంగ్రెస్ అ ధ్యక్షులు కంబాల ముసలయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడం చేతగాని దద్దమ్మ లు ప్రశ్నించే గొంతుకులను ఇలా పోలీసుల చేత దౌర్జన్యం గా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వడగళ్ళ వానతో పంట నష్టం జరిగిన రైతులను ఆదుకుంటే కాంగ్రెస్ పార్టీ స్వాగతీస్తుందని, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు 50వేల రూపాయలు పంట నష్టం ఇవ్వాలని కోరారు.
ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టులు
కేసముద్రంరూరల్ : సీఎం కేసీఆర్ పెద్దవంగర మండ లానికి వస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ముం దస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినా వారిలో టీపీసీసీ మెంబర్ గుగులోత్ దస్రు నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీ సీ అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధి కార ప్రతినిధి అయుబ్ ఖాన్, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయ కుడు ఎన్ఎ.స్టాలిన్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్, బీజేపీ కేసముద్రం మండల ప్రెసిడెంట్ పొ దిల నర్సిసింహ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు దారవత్ శోభన్ నాయక్, ప్రవేట్ స్కూల్ మేనేజిమెంట్ జోగు డాగ య్య, సీఐటీయూ మండల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ. సలిమ బేగం, కాంగ్రెస్ నాయకులు కొంతం కోటి, కత్తేరశాల శ్రీని వాస్, కనుకుల రాంబాబు, ఎస్కే పాషా ఉన్నారు.
సీపీఎం నాయకుల అక్రమ అరెస్టు ఖండించండి
మహబూబాబాద్ : అకాల వర్షాల మూలంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాత్ర సందర్భంగా సిపిఎం నాయకులు అక్రమ రెస్టు ఖండించాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ సుర్ణప సోమయ్య అన్నారు. మహబూబాబాద్ పట్టణంలో గురువారం తెల్లవా రు జామున పోలీసులు సిపిఎం నాయకులు అరెస్ట్ చేసి టౌ న్ పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సు ర్ణపు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కుర్ర మహే ష్ సమ్మెట రాజమౌళి పట్టణ కమిటీ కార్యదర్శి సీతారాం నా యక్ చీపిరి యాకయ్య బూర్గుల లక్ష్మణ్ ఉన్నారు.
సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు
గార్ల : ఇటివల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలను సియం కేసీఆర్ క్షేత్ర స్దాయిలో పరిశీలిం చేందుకు జిల్లా పర్యటన వచ్చిన సందర్భంగా మండలానికి చెందిన పలు పార్టీలు,విద్యార్థి సంఘం, వివిధ యూనియన్ ల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి బ య్యారం పోలీసు స్టేషనులో నిర్భందించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అదేశాల మేరకు శాంతి భద్రతల పరిర క్షణలో భాగంగా ముందస్తు అరెస్టులు చేసినట్లు ఎస్సై బా నోత్ వెంకన్న తెలిపారు. ముందస్తుగా అరెస్టయిన వారిలో బిజెపి పార్టీ జిల్లా,మండల నాయకులు రావూక విమల్ కుమార్ జైన్, జశ్వంత్ ఠాకూర్ ,గొర్రెల మేకల పెంపకందా రుల సంఘం రాష్ట్ర నాయకులు ఇమ్మడి గోవింద్,ఆశ వ ర్కర్స్ యూనియన్(సిఐటియు) మండల అధ్యక్ష, కార్యదర్శి లు రమాదేవి, యం.రమణ, ఏఐఎస్ ఫ్, పిడిఎస్ యు జిల్లా నాయకులు యం.లోకేష్, యం.మహేష్,ఎంఅర్పిఎస్ మం డల నాయకులు వెంకన్న తదితరులు ఉన్నారు.
అక్రమ అరెస్టులతో నిరంకుశ పాలన
పెద్దవంగర : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అక్రమ అరెస్టు లతో నిరంకుశ పాలన సాగిస్తున్నాడని బీజేపీ జిల్లా ఉపాధ్య క్షుడు రంగు రాములు గౌడ్, కాంగ్రెస్ మండల నాయకుడు బానోత్ సీతారాం నాయక్, బీఎస్పీ మండల కన్వీనర్ రాం పాక కిరణ్ కుమార్ అన్నారు. మండలంలో గురువారం ము ఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టులు చేసి, నరసింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అ నంతరం సొంత పూచికత్తుపై నాయకులను విడుదల చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి సాధిం చుకున్న స్వరాష్ట్రంలో అక్రమ అరెస్టులు రోజురోజుకు పెరు గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులతో ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారని ప్రశ్నించారు..? అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజలంతా గమనిస్తున్నారని రాబో యే రోజుల్లో కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్తారన్నారని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మరబోన సుధాకర్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపా ధ్యక్షుడు తల్లారి సోమయ్య తదితరులు ఉన్నారు.