Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట లు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50వేల రూపాయల నష్టపరిహారం అందించాలి అని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. గురువారం సీపీఎం జనగామ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లో ఏ.వోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ అకాల వర్షం, ఈదురుగాలు లు జిల్లా రైతులను అతలాకుతలం చేసిందన్నారు. పంట చేతికందే సమయంలో రైతులకు తీరని నష్టా న్ని మిగిలించిందని తెలిపారు. అప్పుసప్పు చేసి పెట్టు బడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మా రింది. అకాల వడగండ్ల వర్షంతో జిల్లాలో మామిడికా యలు నేలరాలగా వరి, మిర్చి, మొక్కజొన్న, కూరగా యలు తదితర పంటలు కూడా నేలమట్టమయ్యాయ ని అన్నారు. గత ఏడాది తెగుళ్లతో సతమతమై కోలు కుంటున్న రైతులకు అకాల వర్షం గోరుచుట్టుపై రోక టి పోటులా మారిందన్నారు. ఒక్క రైతు ఎకరానికి లక్ష రూపాయల కంటే ఎక్కువగానే పెట్టుబడిపెట్టార న్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జిల్లా వ్యాప్తంగా పంట ల పరిశీలనకు ప్రత్యేక టీమ్‌ను పంపి పంటల నష్టా న్ని అంచనావేసి జరిగిన పంటలనష్టంపై రాష్ట్ర ప్రభు త్వానికి లేఖ పంపించాలని కోరారు.
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, బోట్ల శేఖ ర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, జోగు ప్రకా ష్, నాయకులు మంగ బీరయ్య, పోత్కనూరి కనకాచా రి తదితరులు పాల్గొన్నారు.