Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
బాలాజీ ఇంటిగ్రేట్ టీచింగ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేట్ పాఠశాల ముందు ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ....జిల్లా కేంద్రంలో కొనసాగు తున్న బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ో తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో వెల్తురు లేకపోవడం వల్ల యాజమాన్యం ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేసి క్లాసులు నిర్వ హిస్తున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులకు బోర్డు పై అక్షరాలు పూర్తిస్థాయిలో కనబడకపోవడంతో సైట్ వచ్చే ప్రమాదం ఉంటుందని వివరించారు. గతంలోనే జిల్లావిద్యాశాఖ అధికారులక ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పాఠశాలకు పూర్తిస్థాయిలో ఆటస్థలం లేకపోవడం వల్ల విద్యార్థులు మానసికోలస్సానికి దూరమవుతున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని లేదంటే పాఠశాలను మూసి వేసే వరకు ఆందోళన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు ప్రేమ్‌కుమార్, మట్టెవాడ సురేష్, కార్తీక్, అఖిల్, సాయి చరణ్ ,నవీన్ శివ, నరేష్, తిలక్ టైగర్ తదితరులు పాల్గొన్నారు.