Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 200 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తెలిపారు. శుక్రవా రం కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో సంబందిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 సీజన్లో ధాన్యం కొనుగోలుకు అధికా రులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఐకెని ఆధ్వ ర్యంలో 111, ప్రాథమిక సహకార సోసైటీల ఆధ్వ ర్యంలో 89 కొనుగోలు కేంద్రానలు ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. జిల్లాలో 30 లక్షల 25 వేల గన్ని బ్యా గులు అందుబాటులో ఉంటాయని, ఆయా కేంద్రాల్లో కావల్సిన సౌకర్యాలను కల్పించేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అంచనా మేరకు ఈ యాసంగి సీజన్లో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని, జిల్లాలోని 18 బాయిలర్ రైస్ మిల్లర్లు అన్ లోడింగ్‌కు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్ర మంలో డిఆర్డిఎ పిడి రాంరెడ్డి, డిసిఒ కిరణ్‌కుమా ర్, డిఎస్‌ఒ రోజా రాణి, డిఎం సంధ్యారాణి, సంబం ధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.