Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యదాయకమని, వీటి ని ప్రతిఒక్కరూ వినియోగించాలని ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి కోరారు. శుక్రవారం మం డల కేంద్రంలోని ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయంలో పోషణ పక్షం కార్యక్రమం సిడిపిఓ మల్లీశ్వరి అధ్య క్షతన, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవ త్సరం మిల్లెట్ మహోత్సవంలో భాగంగా చిరు ధాన్యా లతో చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, వంటల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ చిరుధాన్యాలను సిరిధాన్యాలుగా పేర్కొన్నారు. గతంతో పోలిస్తే మన ఆహార అలవాట్లలో మార్పు రావడం వల్ల చిరుధాన్యా ల వాడకం క్రమంగా తగ్గిందన్నారు. దీనివల్ల మధు మేహం, రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులు పెరిగి పోయాయని చెప్పారు. గతంలో మాదిరిగా చిరుధా న్యాలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు.పిల్లలకు చిన్నతనం నుంచే చిరుధాన్యాల ఆహా రాన్ని అలవాటు చేయాలని సూచించారు. ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ కోవిడ్ తరువాత ప్రజల దక్పథంలో మార్పు వచ్చిందని, చిరుధాన్యాల విని యోగం కూడా పెరిగిందని చెప్పారు. గర్భిణీ మహి ళలు ఎక్కువగా బలహీనంగా రక్తహీనతతో ఉంటా రని, చిరు ధాన్యాలతో కూడిన పౌష్టికాహారం తీసుకో వాలని, ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చిరుధాన్యాల సాగును, మా ర్కెటింగ్ ప్రోత్సహించడానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత మాట్లాడుతూ పౌర సరఫరాల సంస్థ ద్వా రా చిరుధాన్యాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజనలో భాగంగా రాగి అంబలిని పంపిణీ చేయాల ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. సిడి పిఓ మల్లీశ్వరి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు పోష కాహారలోపాల వల్ల వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమతుల్య ఆహారంలో ఉం డవలసిన పోషక విలువల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పంబపూర్ నార్లాపూర్ 3 సెక్టార్లకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, సూ పర్వైజర్లు విజయ, వి.సుమతి, శారద, ఐసిపిఎస్ సో షల్ వర్కర్ జ్యోతి, సిఐటియు అంగన్వాడీ టీచర్లు స మ్మక్క, సరోజన, జమున పాల్గొన్నారు.