Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు మండలం లోని కర్కాల గ్రామ రైతులు పాలాభిషేకం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కారణంగా పంట నష్టానికి ఎగరాకు పదివేల రూపాయల నష్టపరిహా రం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పా లాభిషేకం చేశామని వారు తెలిపారు. ఈ సంద ర్భంగా జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ మా ట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పాలకుర్తి నియోజకవర్గంలోని పంట నష్టపోయిన రైతులను ఓ దార్చినందుకు కృతజ్ఞతగా రైతులు పాలాభిషేకం చే యడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిగ్యం సురేఖ సురేందర్, ఉపసర్పం చ్ పసులాది వెంకన్న, మండల కో ఆప్షన్ నెంబర్ షే క్ అంకుష్, రైతు బంధు అధ్యక్షుడు రామలింగారెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షుడు రాజలింగం పాల్గొన్నారు.
మొన్న నిరసన.. నిన్న పాలాభిషేకం
పెద్దవంగర : అకాల వర్షాలకు దెబ్బతిన్న పం టలను పరిశీలించడానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మండలంలోని పోచారం, రెడ్డికుం ట తండా, సర్పంచ్ తండాల్లో పర్యటించారు. కాగా సీఎం పర్యటనలో తమ పంట పొలాలను పరిశీలిం చాలని రెడ్డికుంట తండాకు చెందిన పలువురు రైతు లు నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. పంట నష్టపోయిన రైతులకు పునరావాసం కింద ఎకరానికి 10 వేల రూపాయలు చెల్లిస్తామని సీఎం కేసిఆర్ ప్రకటించి, వెంటనే జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా మొన్న నిరసన వ్యక్తం చేసిన రైతులే, నిన్న సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భం గా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ పంట లను పరిశీలించలేదని బాధపడ్డాం. కానీ రైతులకు రూ. 10 వేలు పునరావాసం కింద ఎకరానికి చెల్లిస్తా మని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అటు కౌలు రైతులను సైతం ఆదుకుంటామని కేసీఆర్ ప్రక టించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ బానోత్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ రై తుల బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశానికే ఆదర్శంగా పలు సంక్షేమ, అభివృద్ధి ఫలాల ను అందిస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని వ్యా ఖ్యానించారు. కార్యక్రమంలో బానోత్ యాకుబ్, బా నోత్ బిక్షం, జాటోత్ చంద్రు నాయక్, బానోత్ సోమా ని, ఆంగోత్ సీతా తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు రైతాంగం తరపున ధన్యవాదాలు
బయ్యారం : పంట నష్టం జరిగిన రైతులను తక్ష ణమే ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బిఆర్ఎస్ మం డల అధ్యక్షుడు తాతగణేష్ అన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల (వడ గండ్ల)వర్షాలు కురవడంతో అధికంగా పంట నష్టం జరిగిన జిల్లాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా పరిశీ లించి, నష్టపోయిన రైతులతో మాట్లాడి పంట వివరా లను అడిగి తెలుసుకున్నారని, రైతాంగ కష్ట నష్టాలు దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎక్కడ, ఎప్పుడూ లేని వి ధంగా వెంటనే ఎకరానికి పదివేల రూపాయలు నష్ట పరిహారాన్ని ప్రకటించి, వెంటనే జీవోను జారీ చేసి నందుకు సీఎం కేసీఆర్‌కు రైతు బంధు రాష్ట్ర అధ్యక్షు లుకు రైతంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలి యజేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం లో సోసైటీ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్లు రాయల రాజేష్, సూరం రవీందర్ రెడ్డి, మండల నాయకులు ధార రఘుపతి, పల్లెపంగు ఉపేందర్, చెరుకుపల్లి రవి కృష్ణ, ఇస్లావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
గార్ల : పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రై తుల పంటలకు ఎకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్య వాదాలు అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు.వర్షాలతో దెబ్బ తిన్న పంటలకు ఎకరానికి 10 వేల చొప్పున నష్ట పరి హారాన్ని సియం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ శుక్రవారం స్దానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ ఎస్ అధ్వర్యంలోసియం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు,రైతు భీమా అందిస్తున్న ప్రభుత్వం ప్రకృ తి వైపరీత్యం వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్దాయిలో పరిశీలించి రైతులకు నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ తక్షణమే నష్టపరిహారం ప్ర కటించడం,కౌలు రైతులను సైతం ఆదుకుంటామ ని చెప్పడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధిని తెలుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, ఎంపిటీసి శీలం శెట్టి రమేష్, నాయ కులు పి.రాధాకృష్ణ, భాస్కరావు, ఉమేష్, రావూజీ, చంద్రశేఖర్, వి.వెంకటేశ్వర్లు, కో-అప్షన్ సభ్యులు ఖదీర్, ఆలయ కమిటీ చైర్మన్ బానోత్ అమర్ చంద్,కార్యకర్తలు పాల్గొన్నారు.