Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించిన బాధిత రైతులు
నవతెలంగాణ-తొర్రూరు
మా కంపెనీ విత్తనాలు వాడితే అధిక దిగుబడి వస్తుందని చెప్పి తీరా పంట వేసాక దిగుబడిరాక నష్ట పోయామని నరసింహుల పేట మండలానికి చెంది న రైతులు అన్నారు. కంకికి గింజ పట్టని ఆడ మగ మొక్కజొన్న విత్తనాలు తమకు అంటగట్టి మోసగిం చిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్ర వారం డివిజన్ కేంద్రంలో జిల్లా వినియోగదారుల ఫోరం ఇంచార్జ్ వింజమూరి సుధాకర్‌కు బాధిత మొ క్కజొన్న రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం మహబూ బాబాద్ జిల్లా నరసింహుల పేట మండలానికి చెంది న చెన్నూరి నరసింహారెడ్డి, భూక్య సంజీవ, లూనావ త్ వెంకన్న, గండి శరత్, భూక్య సూక్య, భూక్య జామ్లా లు హైబ్రిడ్ మొక్కజొన్న పండించేందుకై గతేడాది నవంబర్‌లో శేఖర్ కంపెనీకి చెందిన ఆడ మగ మొ క్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశారు. నలుగురు రై తులు 16 ఎకరాలకు గాను 144 కిలోల ఆడ మొక్క జొన్న విత్తనాలు, 40 కిలోల మగమొక్కజొన్న విత్తనా లు మొత్తం కలిపి 184 కిలోల విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేశారు. కంపెనీ ప్రతినిధుల సూచన మేర కు విత్తన్ల్నా విత్తగా సమయం దాటినప్పటికీ కంకికి గింజ పట్టలేదు. కంపెనీ ప్రతినిధులు చూపిన మోస పూరిత హైబ్రిడ్ మొక్కజొన్న ఆశకు ఆ విత్తనాలు నా టితే ఎకరాకు 45 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండ గా ఒక క్వింటా దిగుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 16ఎకరాల్లో ఈ పంట సాగు పై ఐదుగురు రైతులు రూ. 7,76,000 ఖర్చు చేశారని, మోసపూరిత ఆశ చూపి నకిలీ విత్తనాలు అంటగట్టిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని, సాగు ఖర్చులు, పరిహారం కింద రూ.13.50 లక్షలు అం దించాలని వారు వినియోగదారుల సమాచార కేం ద్రం బాధ్యునికి ఫిర్యాదు చేశారు. కావున తమను మో సగించిన శ్రీకర్ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసు కొని నష్టపరిహారం అందే విధంగా సహకరించాలని బాధిత రైతులు కోరారు. బాధిత రైతుల నుంచి వివ రాలు సేకరించిన జిల్లా వినియోగదారుల కేంద్రం ఇంచార్జ్ వింజమూరి సుధాకర్ శ్రీకర్ కంపెనీకి నోటీ సులు పంపి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.