Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
నియోజకవర్గంలోని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపా డుకుంటానని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మండలంలోని పార్వతమ్మ గూడెం ఫంక్షన్ హాల్లో బి.ఆర్.ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరిపాటి వెంకటరెడ్డి అధ్యక్ష తన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కో సం కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తిని పార్టీ కాపాడుతుందని అన్నా రు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కాపాడాని ఉద్దేశంతో కేసీఆర్ నాలుగు జిల్లాలో ఒకేరోజు పర్యటించి రైతుల ఆదుకుంటానని ఎకరాకు పదివేల రూపాయలు తక్షణమే అందిస్తామని వెంటనే జీవోను విడుదల చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదష్టమని కెసిఆర్‌కు ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అంతే కాకుండా మాను కోటను బంగారు కోటకు అబివృద్ధి తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ నియోజక వర్గంలో ప్రతీ తండాను గ్రామపంచాయతీ గుర్తించిన ఘనత కూడా కేసిఆర్ గారి అన్నారు ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతీ గడప గడపకు అందించే విధంగా కృషి చేశారని అన్నారు. ప్రతీ ఒక్కరు అన్ని రంగాల అబివృద్ధి చెందినందుకు చేయూతనిచ్చేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలను తీసు కొని కృషి చేస్తున్న రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కాంగ్రెస్ బిజెపిలో మనుషుల మధ్య చిచ్చులు పెడుతూ పార్టీలను గుణపాఠం చెప్పేరోజు దగ్గర పడ్డా యని అన్నారు. రోజు 24 గంటలు నియోజకవర్గంలో ఉంటూ 366 రోజులు ప్రజ ల సమస్య పరిష్కారంగా ఉంటున్నానని ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా వెంట నే వచ్చి నా సమస్యగా మీద వేసుకొని పరిశీలిస్తున్నారని అన్నారు. గత పాలకులు పట్టించుకున్న పాపాన లేదని అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రా మంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఇటీవల మరణించడంతో అతని తండ్రి తాళ్ల ఉప్పలయ్యకు రెండు లక్షల రూపాయల చెక్కున అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వేన్నాకుల శ్రీనివాస్, జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్‌రావు, వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్, స్థానిక సర్పంచ్ పారుపాటి రుక్మిణి వెంకటరెడ్డి, ఎంపీటీసీ వెన్నాకుల వాణి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా మండల కోఆర్డినేటర్లు బాలాజీ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కసర బోయిన విజయ్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షు లు రైతు కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.