Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
గిరిజన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఏజెన్సీ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మూస్మి గ్రామపంచాయతీలో 70 లక్షలతో మంజూరైన బీటీ రోడ్డు పనులకు, రామన్నగూడెం గ్రామంలో 20 లక్షలతో మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు నీటి ఎద్దడి గురించి మంత్రికి వివరించగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తక్షణం చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడు తూ గిరిజన ప్రజలకు పాకాల చెరువు నీటిపై ఎత్తిపోతల పథకం నిర్మించి ఈ ప్రాంతంలోని గొలుసు కట్టు చెరువులన్నింటిని సాగునీరుతో నింపుతామని తద్వా రా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా తాగునీటి కొరత ఉండ దన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ గిరిజన యువత మంచి గా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. పిల్లల చదువే పెద్దలు ఆస్తి గా పరిగణించాలన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీ శ్వర్, ములుగు గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఐటిడిఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, తహసిల్దార్ నరేష్, ఎంపీడీఓ భారతి, ఓడిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ దేసుడు శ్రీనివాస్ రెడ్డి,జెడ్పిటిసి పులుసం పుష్పలత, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, సర్పంచులు కల్తీ రమ వెంకన్న, బానోత్ సుగుణ కిషన్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, మండల అధికార ప్రతి నిధి జవహర్ లాల్ నెహ్రూ, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.