Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నొక్కుతుంది
- త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం
- నేడు నిరసనలు
- ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని కక్ష సా ధింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే సీ తక్క అన్నారు. రాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం కక్ష సా ధింపుకు నిరసనగా శనివారం ఉదయం అన్ని మండల కేం ద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నిరసన కార్యక్ర మాలు, ధర్నాలు, దీక్షలు, చేపట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో, ఈదేశం కోసం, దేశ ప్రజ ల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీతరం, ఎవరితరం కాద న్నారు.రాహుల్ గాంధీ పై అనర్హత వేటుపై న్యాయపోరాటం తో పాటు రాజకీయంగాను కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని, దీనిపై తాము భయపడేదిగానీ, మౌనంగా ఉండేది లే దని స్పష్టం చేశారు.ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజ పా సర్కార్ నొక్కుతోందని ప్రజాసమస్యలపై, ప్రభుత్వ విధా నాలపై పార్లమెంటులో గళమెత్తే రాహుల్‌గాంధీని సభ నుం చి వెళ్లగొట్టారని పార్లమెంటులోప్రతిపక్షాలనుప్రభుత్వం అణి చివేస్తే ప్రజల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ పై బీజేపీ కుట్ర
టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మి నారాయణ నాయక్
పాలకుర్తి : కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ పై బిజెపి కుట్ర చేస్తూ అక్రమ కేసుల ను బనాయిస్తుందని టిపిసిసి సభ్యులు డాక్టర్ లకావత్ లక్ష్మీ నారాయణ నాయక్ ఆరోపించారు.శుక్రవారం కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బిజెపి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాలకుర్తి బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణతో కలిసి లక్ష్మీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ప్రజాదరణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల కు పాల్పడుతూ రాహుల్ గాంధీ పై అక్రమ కేసును బనా యించడం సిగ్గుచేటని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ వెంట ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వీర సైనికులుగా పనిచేస్తారని తెలిపారు. కంద్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్, దేవరుప్పుల మండల అధ్యక్షులు పెద్ది క్రిష్ణమూర్తి గౌడ్, మండల ఎస్టి సెల్ అధ్యక్షులు లావు డ్యా భాస్కర్,కామారెడ్డిగూడెం ఎంపీటీసీ మహమ్మద్ జాకిర్, పాలకుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు హరీష్, మండల నాయకులు గాదెపాక ఎల్లయ్య, మాడరాజు యాకయ్య, భైరు భార్గవ్, గడ్డం బాబు, నాయకులు భూక్యా శ్రీను, లకావత్ రవి, సింగిరెడ్డి స్వామి పాల్గొన్నారు.
గాంధీ సెంటర్లో మౌనం దీక్ష
తొర్రూరు : ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడడం పిరికి పంద చర్య అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి సధాకర్ అన్నారు. రాహుల్ గాంధీ పై కేసును నిరసిస్తూ సా ్థనిక గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాళ్లపల్లి బిక్షం గౌడ్, ఓబీసీ సెల్ మండల అధ్య క్షులు దీకొండ శ్రీనివాస్, వార్డ్ కౌన్సిలర్ భూసాని రాము, రాహుల్ యువసేన డివిజన్ అధ్యక్షులు రాయపల్లి రాజు, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్ యాదవ్, పయ్యావుల ప్రవీణ్ యాదవ్, సతీష్, దేవేందర్, మురళి, గిరి బాబు, నితీష్ గౌడ్, శ్రీకాంత్, నరేష్, షరీఫ్, వంశీ, చింటూ, సలీం, అనిల్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాధరణ చూసి ఓర్వలేకనే కేంద్రం కుట్రలు : హమ్య నాయక్
మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తున్న భా రత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలే కనే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయం లో శుక్రవారం ముఖ్య నాయకుల సమావేశం మండల అధ్య క్షులు జక్కుల రామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హమ్య నాయక్ పాల్గొని మాట్లాడారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతూ రాహుల్ గాంధీ పై అక్రమ కేసును బనాయిం చడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, పెద్ద వంగర మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, దుంపల శ్యామ్, మేకల కుమా ర్,తొర్రూర్ ఎస్టీ సెల్ అధ్యక్షులు జాటోతు రవి నాయక్, పెద్ద వంగర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, రాయపర్తి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దీకొండ మధు, కన్నెకంటి కష్ణారెడ్డి, పెండ్లి మహేందర్ రెడ్డి, మంద నరేందర్ రెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, ఉప్పలయ్య, అభిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అప్రజాస్వామికం : మండల కాంగ్రెస్ కమిటీ
బయ్యారం : ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కి సూరత్ కోర్ట్ 2 యేళ్ల జైల్ శిక్ష విధించడం దుర్మార్గం, అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కం బాల ముసలయ్య అన్నారు. శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయ ని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ వేసిన రెండేళ్ల శిక్షపైన ఉన్నత కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, రామచం ద్రపురం ఎంపీటీసీ భూక్యా లక్ష్మి, మండల ప్రధానకార్యదర్శి గట్ల గణేష్, గౌరీశెట్టి వెంకన్న, గుగులోత్ రాంకోటి, రామగిరి వెంకటేశ్వర్లు, ఆకునూరి సూర్యనారాయణ, తిరుమల సుధా కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుర్మార్గపు చర్య : కుమారస్వామి
పెద్దవంగర : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అన ర్హత వేటు వేయడం దుర్మార్గపు చర్య అని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు దుంపల కుమారస్వామి మండి పడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతిపక్ష నాయకులను బీజేపీ అక్రమ కేసులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చర్యలకు భయపడేది లేదని, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు పూ నుకుందని విమర్శించారు. రాహుల్ గాంధీపై చర్యలను తీ వ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజ ని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్ర మంలో రంగు మురళీ, సర్పంచ్ జగ్గా నాయక్, ముత్యాల పూర్ణచందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతా రాంనాయక్, బీసీ సెల్ మండల అ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు జానీ, పన్నీరు వేణు, బా లాజీ నాయక్, అనపురం శ్రీనివాస్, వినోద్, వెంకన్న, ఆవుల మహేష్, కందుల దేవేందర్, నరబోయిన రాంచరణ్, రాం బాబు తదతరులు పాల్గొన్నారు.
బీజేపీ కక్ష్యసాధింపు చర్య : ఇందిరా
స్టేషన్‌ఘన్‌పూర్ : బీజేపీ కక్ష్యసాధింపు చర్యలకు పాల్ప డుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందిర విమర్శించా రు. శుక్రవారం నియోజక వర్గ కేంద్రంలో పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహు ల్ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని అన్నారు. ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లుతున్న, ఈదేశంలో కుల, మతాల మధ్య చిచ్చులు రేపుతూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాహుల్ నాయక త్వంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కా ర్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్వ ర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజి, యువజన కాం గ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి, జిల్లా మహిళా ఉపా ధ్యక్షురాలు అధ్యక్షురాలు విజయ మేరీ, రఘునాథపల్లి ఎంపీ పీ మేకల వరలక్ష్మి నరేందర్, నియోజకవర్గ యువజన కాంగ్రె స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, మండల అధ్యక్షులు శిరీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, మండల మహిళా అధ్యక్షురాలు చింత జ్యోత్స్న, మండల ఉపాధ్యక్షులు కోరు కొప్పుల మహేందర్ కిసాన్ సెల్ అధ్యక్షులు సింగపురం వెం కటయ్య, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐలపాక శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మారపాక వసంత్, తదితరులు పాల్గొన్నారు.