Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
- జిల్లా వైద్యశాఖ ఆరోగ్య ఆధ్వర్యంలో టీబీ అవగాహన ర్యాలీ
నవతెలంగాణ-భూపాలపల్లి
టీబి నిర్మలకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని 2025 నాటికి క్షయ వ్యాధి రహిత తెలంగాణ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యశాఖ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు .
అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ 2025 సంవత్సరం నాటికి తెలంగాణలో పూర్తి టిబి రహిత తెలంగాణగా తీర్చిదిద్దరమే ధ్యేయంగా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దష్టి సారించారని అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా చాలామంది క్షయ భారీనుంచి కోలుకుని సాధరన జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. టీవీ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, క్షయ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య సాగర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, స్థానిక కౌన్సిలర్ హారిక , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీరాం, డాక్టర్ ఉమాదేవి, వైద్యులు, సిహెచ్ఓ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
గణపురం : క్షయ వ్యాధిని తరిమికొట్టాలని డాక్టర్ అనుష. తెలిపారు. శుక్రవారం జాతీయ టీబీ నిర్మూలన సందర్భంగా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష. మాట్లాడుతూ టీవీ వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. టీబి సోకినవారు క్రమం తప్పకుండా మందులు వాడితే తగ్గిపోయే వ్యాధి అని దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు టీవీ వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. టిబి వ్యాధి అంటూ వ్యాధి అని దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో టిబి వ్యాధిని నిర్మూలించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు .ఏఎన్ఎం.లు తదితరులు పాల్గొన్నారు.
మహాముత్తారం : క్షయ నివారణకు అనేక అవగాహన సదస్సులు, నివారణ కార్యక్రమాలు వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం వంటివి అందిస్తూ వైద్య ఆరోగ్య శాఖలు చర్యలు చేపడుతున్న అవగాహన లేమి నిర్లక్ష్యం తదితర కారణాలతో టీబి కేసులు బయటపడుతున్నాయి. టీబి ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది అనే నినాదంతో ఏడాది పాటు ఆవ గాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా మహా ముత్తారం మండలంలోని స్థానిక పిహెచ్సి డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలో టిబి నివారణ కు అవగాహనర్యాలీ నిర్వహించారు. ప్రపంచ టీబీ డే సందర్భంగా అవగాహనా ర్యాలీని .టీబీ కి సంబంధించిన నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ ,ఇంచార్జి సూపర్ వైజర్ సూర్యకల , ఏఎన్ఎం సరోజన ,కుమార ,శారద, భారతి ,మంజుల ,ఆశ వర్కర్లు పాల్గోన్నారు .
మహదేవపూర్ : మహాదేవపూర్ మండలంలోని అంబటి పెళ్లి గ్రామంలో శుక్రవారం ప్రపంచ టిబిినోత్సవాన్ని ప్రోత్సహించుకొనిపాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించిఅవగాహన కల్పించారు అనంతరండ్రై డే చేతులు శుభ్రతపైవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలోసూపర్వైజర్ మసూక్ అలీఏ ఎన్ఏంలు ఆశ వర్కర్లుఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.