Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా పోరుయాత్రను విజయవంతం చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ ప్రజా పోరు యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివద్ధి సాధనకై తెలంగాణ విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ హామీల అమలుకై సిపిఐ ప్రజా పోరు యాత్రను నిర్వహించడం జరుగు తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలను నిలబెటు ్టకోవాలని డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ , కాజీపేటలో రైల్వే కోచ్ ను ఏర్పాటు చేయాలని, సింగరేణి ని ప్రవేటీకరణ చేయకుండా చూడాలని, ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ములుగు లో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలని ఈనెల 25వ తేదీన ప్రజా పోరుయాత్ర బయ్యారం న ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పోరు యాత్రకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని.సాంబశివరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శులు , 200 మంది పోరుయాత్ర బందం పాల్గొంటున్నారని తెలిపారు. బయ్యారంలో ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీన హనుమకొండలో ముగింపు భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.సిపిఐ నిర్వహించే ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్.సతీష్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, రాసపల్లి భద్రయ్య, షాబీర్, చిలకని రమేష్, గట్ల శ్రీనివాస్, పుప్పాల.వనిత,గోలి.లావణ్య,పొనగంటి. లావణ్య, సుజాత, గడ్డం స్వరూప, సౌజన్య, పొలం. తేజ, ఇన్చంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.