Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
పంచాయతీరాజ్, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అభివద్ధి పనులతోపాటు, 9 అంశాలకు సంబం ధించిన పనుల్లో వేగంగా, నాణ్యమైన పనులు చేపట్టడమే కాక నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసి లక్ష్యం సాధించిన ఆయా గ్రామపంచాయితీల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతుల షీల్డ్, ప్రశంశ పత్రాలను ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, ఎంపిడిఓ నరసింహమూర్తి లు ప్రదానం చేశారు. మండలంలో మొత్తం 15 గ్రామపంచాయితీలు ఉండగా ఇందులో 7 మాత్రమే అవార్డులు గెలుపొందాయి. అవార్డులు పొందిన వాటిలో వల్లేంకుంట, మల్లారం, కొండంపేట, అడ్వాలపల్లి, దుబ్బపేట, కొయ్యుర్, తాడిచెర్ల ఉన్నాయి కార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగు నాగరాని లక్ష్మీ నారాయణ, కొప్సన్ ఆయూబ్ ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మహదేవపూర్ : మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవం మండల పరిషత్ అధ్యక్షుల రాణి బాయి రామారావు గారి అధ్యక్షతనశుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి రఘువరన్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఏ .రవీంద్రనాథ్ ఎంపీడీవో మహాదేవపూర్ మాట్లాడుతూ ఈ జాతీయ పంచాయతీ అవార్డులు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి (09) అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన గ్రామ పంచాయతీలను కేంద్రం గుర్తించడం జరిగింది అని, ఇట్టి అవార్డులు కూడా అంశాల వారిగా ప్రథమ, ద్వితీయ మరియు తతీయ స్థాయిలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ రోజున జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామపంచాయతీల వారికి బహుమతుల ప్రధానం చేయబడునని తెలియజేయడం జరిగింది.
బొమ్మాపూర్కు 2 జాతీయ అవార్డులు
మండలంలోని బొమ్మపూర్ గ్రామ పంచాయతీకి రెండు జాతీయ అవార్డులు రావడానికి సహకరించిన బొమ్మపూర్ గ్రామ ప్రజలకు మరియు బొమ్మపూర్ గ్రామ పంచాయతీసర్పంచి ఓడేటి పద్మా రవీందర్ రెడ్డి పాలకవర్గంకి ఉప సర్పంచ్ ఎంపీటీసీ బండం పుష్ప లక్ష్మారెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య సిబ్బందికి అంగన్వాడి టీచర్ కి మరియు గ్రామ ప్రజలకు పేరు పేరు నా ధన్యవాదాలు కతజ్ఞతలు తెలిపిన సర్పంచి
పలిమెల మండలంలోని ముకునూరు దమ్మూరు, పలిమెల, లంకలగడ్డ, నీలంపల్లి, మోదీడు పంచాయతీలకు అవార్డులు రావడంతో శుక్రవారం సర్పంచ్లకు, కార్యదర్శులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురుసం బుచ్చక్క, ఎంపీటీసీ కళ్యాణి, ఎంపీడీవో ప్రకాష్ రెడ్డి, సర్పంచి పుష్పలతా తిరుపతి పాల్గొన్నారు.
కాటారం : మండలంలోని గంగారం గ్రామపంచాయతీకి 9 ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు వచ్చినట్లు గంగారం సర్పంచ్ తేప్పల దేవేందర్ రెడ్డి తెలిపారు. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, , వాటర్ సఫీషియెంట్ పంచాయతీ, పంచాయతీ ఫర్ గుడ్ గవర్నెన్స్, సోషలిస్ట్ సెక్యూరిటీ పంచాయతీ, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయితీ, పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, స్వయం సమద్ధి మౌలిక, హెల్త్ పంచాయతీ అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గం, గంగారం గ్రామ ప్రజలకు కతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ సమ్మయ్య, ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీ ఓ ఉపేంద్రయ్య, వైస్ ఎంపీపీ సిహెచ్ తిరుమల తిరుపతి, కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రేగొండ : మండలంలోని ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన సర్పంచులకు అధికారులు సన్మానం చేశారు. మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, పొనగండ్ల, దమ్మన్నపేట ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. కాగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సర్పంచులు గంపల సుమలత భాస్కర్, చిగురు మామిడి రజిత రాజు, నడిపెళ్లి శ్రీనివాసరావులకు మండల ప్రత్యేక అధికారి సామెల్, ఎంపీపీ పున్నం లక్ష్మి, జెడ్పిటిసి సాయిని విజయ లు శాలువాతో సన్మానం చేసి మెమొంటోను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్ దయాల్ ద్వారా మండల స్థాయిలో ఉత్తమ జిపిలుగా ఎంపికైన జిపి ల సర్పంచ్ లను అభినందించారు. ఉత్తమ జిపిలుగా ఎంపికైన సర్పంచులు మాట్లాడుతూ ఉత్తమ అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్ని శాఖల అధికారులతో కలిసి మరింత అభివద్ధి చేసేందుకు కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, సర్పంచులు అంబల చందు, పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఏడు నూతుల నిషేధర్ రెడ్డి, లింగంపల్లి ప్రసాదరావు, బండారి కవిత దేవేందర్, దేవనూరి ప్రణతి శ్రీనివాస్, లింగంపల్లి శ్వేత రాజు, దండ బోయిన సంతోష్, అడప స్వర్ణలత సుధాకర్, బానోతు బిక్య నాయక్, దాసరి నారాయణరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, మైస బిక్షపతి, గంజి రజనీకాంత్, పున్నం రవి, కేసిరెడ్డి ప్రతాపరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చిట్యాల : జాతీయ పంచాయతీ అవార్డులు 2023 లి'దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్'లి మండలస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవము, ఆత్మీయ సన్మాన కార్యక్రమమును శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ దావు వినోద, జడ్పిటిసి గొర్రె సాగర్ మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ పాల్గొని అవార్డు గ్రహీత లు సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులను అవార్డులు ప్రదానం చేసి శాలువాతో సన్మానించారు.ఈ మేరకు మండలంలోని ఉత్తమ జీపీలుగా నవాబుపేట, అందుగు తండా, తిరుమలాపూర్ ,చైన్పాక, జూకల్, లక్ష్మీపూర్ తండా, బాసింగ్ పల్లి, ఓడితల నైన్ పాక ,చల్లగరిగే, చింతకుంట రామయ్య పల్లి, గ్రామాలు 9 విభాగాల్లో 12 గ్రామపంచాయతీలకుగాను 27 అవార్డులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో రామయ్య, ఎంపీఓ రామకష్ణ, వివిధ గ్రామాల సర్పంచులను అధికారులను ఘనంగా శాలువాలతో సన్మానించారు పంచాయతీకార్యదర్శులు పాల్గొన్నారు.
టేకుమట్ల : మండలంలోని గర్మిళ్లపల్లి, ఎంపేడు, రాఘవాపూర్, అంకుషాపూర్, రాఘవరెడ్డి పేట, రామకిష్టా పూర్ (టీ,), వెంకట్రావుపల్లి, రామకష్ణాపూర్ (వి ), అసిరెడ్డిపల్లి, పంగిడిపల్లి, టేకుమట్ల, వెలిశాల, మందలోరిపల్లి, కుందనపల్లి గ్రామాలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నిక కావడం జరిగింది. కాగా శుక్రవారం మండలంలోని రామకష్ణాపూర్ గ్రామంలో గల ఎమ్మార్సీ భవనంలో స్థానిక ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో అనిత ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు శాలువలతో సన్మానం చేసి అవార్డులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని మిగతా గ్రామాలు కూడా పోటీ పడాలని అందరూ బహుమతులు సాధించే విధంగా పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సురేష్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు , మీద గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మహాముత్తారం : నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2021-22 పోటీలో మహాముత్తారం మండల పరిధిలోని 9 థీమ్ లలో ప్రథమద్వితీయతతీయ స్థానాలను పొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. మొదటి థిమ్లో ప్రథమ స్థానంలో పెగడపల్లి ద్వితీయ స్థానంలో స్థంభంపల్లి పిపి తతీయ స్థానంలో కనుకునూరు కాగా, రెండవ స్థానంలో మండల ప్రథమ స్థానంలో సింగారం తతీయ స్థానంలో జీలపల్లి, 2వ స్థానంలో ప్రథమ స్థానంలో ములుగుపల్లి ద్వితీయ స్థానంలో నల్లగుంట మీనాజిపేట తతీయ స్థానంలో రెడ్డి పల్లి 4వ, థీమ్ లో ప్రథమ స్థానంలో కనుకునూరు ద్వితీయ స్థానంలో జీలపల్లి తతీయ స్థానంలో సింగంపల్లి, 5 వ, థీంలొ ప్రథమ స్థానంలో జీలపల్లి ద్వితీయ స్థానంలో పెగడ పల్లి తతీయ స్థానంలో పోలారం,6వ, థీమ్ లో ప్రథమ స్థానంలో నల్లగుంట మీనాజిపేట ద్వితీయ స్థానంలో బోర్లగూడెం, తతీయ స్థానంలో సింగంపల్లి, 7వ థీమ్ లో ప్రథమ స్థానంలో బోర్లగూడెం, ద్వితీయ స్థానంలో ప్రేంనగర్ తతీయ స్థానంలో కనుకునూరు, 8వ థీమ్ లో ప్రథమ ప్రథమ స్థానంలో బోర్లగూడెం ద్వితీయ స్థానంలో నల్లగుంట మీనాజిపేట ద్వితీయ తతీయ స్థానంలో స్థంభంపల్లి పిపి, 9వ థీమ్ లో ప్రథమ స్థానంలో రెడ్డి పల్లి ద్వితీయ స్థానంలో సింగంపల్లి తతీయ స్థానంలో ములుగుపల్లి గ్రామాలు మండల స్థాయిలో ఎంపిక అయ్యాయి. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గంట్ల ఉమాదేవి, కోర్లకుంట యంపీటీసీ కోడి అర్జయ్య మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు , పి. ఆర్ ఏఈ సురేష్, ఏపియం రామకష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, కార్యాలయ పర్యవేక్షకుడు రమేష్, సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కాటారం : జాతీయ పంచాయతీ అవార్డుల సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమం శుక్రవారం కాటారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ అవార్డులకు ఎంపికైన సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. 9 విభాగాలలో ఈ అవార్డులకు ఎంపిక చేశారు. గంగారం గ్రామపంచాయతీకి 9 అవార్డులు రాగా 6 ప్రథమ అవార్డులు, రెండు ద్వితీయ అవార్డులు మరొకటి తతీయ అవార్డులు వచ్చాయి. ధన్వాడ గ్రామానికి ఆరు అవార్డులు రాగా ప్రథమ అవార్డు ఒకటి , ద్వితీయ అవార్డులు 5 వచ్చాయి.శంకరంపల్లి గ్రామానికి నాలుగు అవార్డులు రాగా ప్రథమ అవార్డు ఒకటి, ద్వితీయ ఒకటి, తతీయ రెండు అవార్డులు వచ్చాయి. గుమ్మల్లపల్లి రెండు రాగా ఒకటి ద్వితీయ అవార్డు, తతీయ అవార్డు ఒకటి వచ్చాయి. జాదారావుపేట తతీయ అవార్డు ఒకటి, వీరాపూర్ తతీయ అవార్డు ఒకటి, రేగుల గూడెం తతీయ అవార్డు ఒకటి, చింతకాని తతీయ అవార్డు ఒకటి, ఇబ్రహీంపల్లి తతీయ అవార్డు ఒకటి, కాటారం ప్రథమ అవార్డు ఒకటి వచ్చాయి. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులను గ్రామ ముఖ్య నాయకులను ఘనంగా సన్మానం చేసి అవార్డు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీ ఓ ఉపేంద్రయ్య,వైస్ ఎంపీపీ సిహెచ్ తిరుమల తిరుపతి, సర్పంచులు టి దేవేందర్ రెడ్డి, జంగిలి నరేష్, ఆత్మకూరి రాజయ్య యాదవ్, తోట రాధమ్మ, ఎంపీటీసీలు బండం రాజమణి, విజయ రెడ్డి, మమత, కార్యదర్శులు షకీర్ కాన్, శేఖర్, శివ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.