Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మం డలాల పరిధిలో ఏర్పాటైన కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమం దేశంలో నంబర్ వన్‌గా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డిఅన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వస్త్ర పరిశ్రమలో పర్యటిం చారు. ఈ సందర్భంగా గణేశాఈకోటెక్, ఈకో పెట్ కంపెనీ ల్లో ప్లాస్టిక్వ్యర్ధ బాటిళ్లతో దారం తయారీ విధాన్నాన్ని పరిశీ లించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆ ర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు రైతుల సహకారంతో 1350 ఎకరాల భూసేకర ణ చేయడం జరిగిందన్నారు. భూసేకరణకు సహకరించిన ప్రతీరైతుకు కృతజ్ఞతలు తెలియచేసారు.భూసేకరణలో భూ ములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 100 గజాల భూమి ని కేటాయించడం జరిగిందన్నారు. ఇక్కడనెలకొల్పే కంపె నీలలో పరోక్షంగా,ప్రత్యక్షంగా లక్ష నుండి 1.50 లక్షల మంది వరకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ము ఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలి పారు. ఇప్పటికే కాకతీయ వస్త్ర పరిశ్రమలో అవసరమైన స దుపాయాల కల్పనకోసం 366 కోట్ల 75 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని,పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని తెలియచేసారు.ఈ నిధులతో వస్త్ర పరిశ్రమ చుట్టూ 29 కిలోమీటర్ల పొడవు ప్రహారీగోడ అంతర్గత రోడ్లు,సెంట్రల్ లైటింగ్ సిస్టం,రెండు విద్యుత్ ఉపకేంద్రాలు, ప్రధాన నీటిసరఫరా ,అంతర్గత వాటర్ సరఫరాకు కేటాయించడం జరిగిందన్నారు.గతంలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకున్న గణేశా ఈకో పెట్, గణేశా ఈకో టెక్ కంపెనీలు బ్రహ్మాండమైన ఉత్పత్తి జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కంపెనీల నుండి ఉత్పత్తి అయినా మెటీరియల్‌ని విదేశాలకు కూడా న మూనాలు పంపించినట్లు తెలిపారు.ఈ కంపెనీలలో ఇప్ప టికే 750 మందికి పైగా వర్కర్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరోకంపెనీ కైటేక్స్ ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ ప్రారంభంతోమరో 11వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. అతి త్వరలోనే మరో కంపెనీ ఎవర్ టాప్ టెక్స్టైల్, ఆపెరల్ కాంప్లెక్స్ కంపెనీకి శంఖుస్థాపన చేసుకోనున్నట్లు తెలిపారు.ఈ కంపెనీకి ఇప్పటికే 261 ఎకరాలకు పైగా భూమి కేటాయించడం జరిగిందని,ఈ కంపెనీద్వారా మరో 11700 మందికి ఉపా ధి కల్పించవచ్చని అన్నారు.అలాగే సూరత్ కు వలసపోయి తిరిగి వచ్చిన 500 కుటుంబాలకు గాను 135 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు.
కాకతీయ వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక నిధులు,గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపినా, ఏనాడు పట్టించుకోలేదన్నారు.కొద్దిరోజులక్రితం పిఎంమిత్రలో స్థానం కల్పించినట్లు కేంద్రం ప్రకటించిం చింది.అందులో ప్రత్యేకమైన స్థానం మన కాకతీయ వస్త్ర పరిశ్రమకు కల్పించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వ రరావు, జెడ్పీటీసీలు గూడ సుదర్శన్ రెడ్డి,పోలీసు ధర్మారా వు, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ కందగట్ల నరహరి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతంసదానందం, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వీరగోని రాజ్ కుమార్, పసునూరి సారంగపాణి,వివిధ గ్రామాల సర్పంచులు, ఎం పీటీసీలు, బీఆర్ఎస్ యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.