Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీఆర్ఎఫ్ బీజేపీ సొత్తు కాదు..తెలంగాణ రైతులకు హక్కు ఉంది
- దమ్ముంటే బండి సంజయ్ కేంద్రం నుంచి తీసుకురావాలి : పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
''రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల జెండాలు వేరైనా..వారిద్దరి ఏజెండా లు ఒక్కటేననీ..జాతీయ విపత్తుల స హాయనిధి వారి అయ్యా సొత్తు కాదు.. ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉం ది..ఇక్కడి ప్రజలకు అందులో హక్కు ఉంది. విపత్కర పరిస్థితిలో ఉన్న రైతు లను ఆదుకోనేందుకు కేంద్ర ప్రభుత్వా నికి మనసొప్పుకోక పోవ డంపై ఇక్కడి బీజేపీ నాయకులు సిగ్గుపడా లి.. దమ్ముంటే బండి సంజరు కేం ద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ తీసుకొచ్చి రైతులకు పరిహారం ఇప్పించాలి' అంటూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎక్కడ జైల్‌కు పంపిస్తారోననీ రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నోరు విప్పడం లేదన్నారు. రేవంత్, బండిసంజరు ఇద్దరి ఏజెండాలు ఒక్కటేననీ వారికి కేసీఆర్ టార్గెట్ అన్నారు.తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవా లనే కుటిల నీతి ప్రదర్శిస్తారే తప్పా ఇక్కడి ప్రజల పట్ల ఏమా త్రం చిత్తశుద్ది లేదని మరో సారి రుజువైందని విమర్శిం చారు. వడగండ్ల వర్షాలు కురిసి రైతులు నష్టపోతే కనీసం పంటలను సందర్శించి ధైర్యం చెప్పకపోవడం సిగ్గుపడలన్నా రు. కేంద్రంలోని బీజేపీ కనీసం రాష్ట్రంలో రైతులకు ఒక్క రూపాయి ఇవ్వకపోవడం బాధకరమన్నారు.కిందటి జనవరిలో వడగండ్ల వానలతో పంటలు కోల్పోయారని, గోదావరి ఉప్పొంగి తీవ్ర నష్టం వాటిల్లగా రాష్ట్రం రూ.వెయ్యి కోట్లు అడిగితే రూపాయి ఇచ్చింది లేదన్నారు. అదే సమయంలో ఎన్నికలొచ్చిన ఐదు రాష్ట్రాలలో మాత్రం రూ.1816 కోట్లను విడుదల చేసిందన్నారు.కేవలం బీజేపీ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చిందని తెలంగాణ రైతులను ఆదుకోనేందుకు మాత్రం చేతులు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.బీజేపీకి ఓట్లు అధికారం తప్పా మరోటి గుర్తుకు రాదని ఎద్దేవజేశారు. రైతులు వ్యవసాయాన్ని వొదిలి పెట్టాలనే బీజేపీ కుట్ర చేస్తుందని దయ్యపట్టారు. అందుకే ఎరువులపై 30 శాతం సబ్సిడీ ఎత్తేసిందని, ఈజీఎస్‌కు 30 శాతం బడ్జెట్ తగ్గించేసిందన్నారు. పంటోత్పత్తులను కొనుగోలు చేయడంలో ఎన్ని కొర్రీలు పెట్టి అడ్డుకుంటుందో చూశామని సీసీఐని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు కొమ్ముకాసి రైతుల నోట్లో మట్టికొట్టిందన్నారు.ప్రాజెక్టులు అక్రమమని రాసిచ్చినోడు మనకెట్లా నాయకుడు అయితాడని, ఆ పార్టీని పట్టుకొని తిరగటోడు ఏవిధంగా నాయకుడెలా అవుతాడో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. దెబ్బతిన్న పంటలపై పరిహారం సరిపోదని అనే బీజేపీ నాయకులు దమ్ముంటే కేంద్రం నుంచి పట్టుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఆపదలో ఉన్న రైతును సీఎం కేసీఆర్ ఆదుకొనేందుకు స్వయాన పర్యటించి ధైర్యం చెప్పాడని ఎకరాకు రూ.10 వేల ఇన్ఫుడ్ సబ్సిడీ ప్రకటించి ఆ వెంటనే నిధులను విడుదల చేశారని తెలిపారు.రైతు పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమేననీ రుజువైందన్నారు. అధికంగా నష్టపోయిన నర్సంపేట ప్రాంత రైతులను ఆదుకొన్నందుకు కేసీఆర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కేవలం పంట పరిహారమే కాదని 10 వేల మంది రైతులకు పీవీసీ పైప్‌లు సబ్సిడీపై ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి మంత్రి నిరంజన్ రెడ్డికి తగు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. త్వరలోనే నష్టపోయిన రైతులకు ప్రాధన్యతనిచ్చి పీవీసీ పైప్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు నల్లా మనోహర్ రెడ్డి, మునిగాల వెంకట్ రెడ్డి, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, గుంటి కిషన్, బుర్రి తిరుపతి, నాయకులు పట్టపాక కుమారస్వామి, వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, మండల శ్రీనివాస్ పాల్గొన్నారు.