Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
అకాల వర్షానికి తడిసిన ధాన్యా న్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయా లని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షు డు, మాజీఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అ న్నారు. శుక్రవారం బిజెపి జిల్లా అ ధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఏనుమాముల వ్య వసాయ మార్కెట్‌ను సందర్శించి త డిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అ నంతరం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్య దర్శి బివి.రాహుల్‌ను కలిసి వివరాలు అడిగితెలుసు కున్నా రు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతిరెడ్డి, తూర్పు ని యోజకవర్గ ఇంచార్జీ కుసుమసతీష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతోముందు చూపుతో ప్రవేశపెట్టిన సఫల్ బీ మా పథకాన్ని రాష్ట్రంలో కెసిఆర్ అమలు చేయకపోవడం వ ల్లనే రైతులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఆసియా లోని అతిపెద్ద రెండో మార్కెట్ అయిన ఏనుమాముల వ్యవ సాయ మార్కెట్ కు వ్యాపారులే పాలకవర్గంగా ఉండడం వ ల్లనే సమస్యలు వస్తున్నాయన్నారు. రైతులకు కనీసం పరదా లు ఇచ్చే స్థితిలో కూడా పాలకవర్గం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సముద్రాల పరమే శ్వర్, బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, రఘునా రెడ్డి పు ల్యాల రవీందర్‌రెడ్డి జన్నుఆరోగ్యం, ప్రవీణ్, కొత్తకొండ రా జు, దండు చక్రపాణి, దామెర సదానందం, చిరంజీవి, కిష న్, బిక్షపతి, రాజు, అపర్ణ, సరస్వతిలు పాల్గొన్నారు.