Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
మహాత్మ జ్యోతిరావుపూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ హానీయుల జయంతి సందర్భంగా ఏప్రిల్ మాసాన్ని మహా నీయుల మాసంగా ఎంచుకొని వారి స్ఫూర్తితో కెవిపిఎస్ పో రాటాలు నిర్వహిస్తుందని జిల్లా ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేవీపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. కెవిపిఎస్ జిల్లా ఆఫీస్బేరర్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబ య్య అధ్యక్షతన రాంనగర్ లో శుక్రవారం జరిగింది. సమావే శానికి ముఖ్య అతిథిగా హాజరైన సంపత్మాట్లాడుతూ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, దళిత వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానాలు చేసి నేటికీ నెరవేర్చలే దని ప్రభుత్వం దళితుల అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేద న్నా రు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి అనేక రాష్ట్రాల్లో దళితులపైదాడులు, అంటరాని త నం, వివక్షత వికృతరూపం దాల్చా యని గతంలో కంటే100శాతం అధికంగా దాడులు జరు గుతున్నాయన్నారు.ప్రభుత్వాలు దళితులకు రక్షణలేకుండా చేస్తున్నాయని. దళితుల సమస్యలపై సమగ్ర సర్వే చేసి పో రాట కార్యక్రమాన్ని రూపొందించుకొనుటకు ఏప్రిల్ మాసం మహానీయుల మాసంగా భావించి కెవిపిఎస్ హన్మకొండ జి ల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుండి 14 వరకు జిల్లా లోని 14 మండలాల గ్రామాల్లో కేవీపీఎస్ బైక్ యాత్ర చేప డుతుందని. జిల్లాలోని అన్నివర్గాలప్రజలు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో ఆఫీస్ బేరర్స్ దూడపాక రాజేందర్, కనకం కావ్య శ్రీ, దానబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.