Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
క్షయవ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్స వాన్ని పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండ జిల్లా వైద్య, ఆ రోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ క్షయ దినోత్సవ సదస్సు నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ టిబి వ్యాధిని సంక్రమింపజేసే బ్యాక్టీరియాను కనిపెట్టిన ప్రొఫెసర్ కాక్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కలెక్ట ర్గా బాధ్యతలు స్వీకరించి వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై సమీ క్షా నిర్వహించినప్పుడు జిల్లాలో క్షయ నియంత్రణ కార్యక్రమం ప్ర భుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని జిల్లాను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడం గమనించానన్నారు. అదేవిధంగా 2023 వ సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి క్షయ వ్యా ధి నివారణలో అందరూ భాగస్వాములను చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రు లలో చికిత్స తీసు కుంటున్న వారి వివరాలుకూడా నమోదు చేసు కుని వారికి కూడా ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక , న్యూట్రి షన్ కిట్లను అందించాలని, ప్రైవే ట్ ఆస్పత్రుల వారిని కూడా ఈ కార్యక్ర మంలో భాగస్వామ్యం చేయాలని, ప్రజా ప్రతి నిధులను కూడా భాగస్వాము లను చేసి వారిసేవలను ఉపయోగించుకో వాలని క్షయవ్యాధి నిర్మూళన సామాజిక బాధ్యతగా గుర్తుతెరగాలని తెలుపుతూ క్షయవ్యాధి నియంత్రణలో పాలుపంచుకుంటున్న సి బ్బందికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో మొత్తము 7492 మందికి తేమడ పరీక్ష చేయగా 1465 క్షయ వ్యాధి కేసులను నిర్ధారించినట్లు అందులో ఎం డి ఆర్ టీబి కేసులు 44 కేసులను గుర్తించినట్లు వీటిలో చికిత్సపరంగా 82 శాతం సక్సెస్ రేట్ గా సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ముందుగా జిల్లా క్షయ నియంత్రణ అధికారిని డాక్టర్ హిమబిందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో క్షయ నియంత్రణలో తీసుకుంటున్న చర్యలు, క్షయ వ్యాధి ప్రివలెన్స్, అవగాహన కార్యక్రమాల గురించి ఆమె వివరించారు.
ఈకార్యక్రమంలో హనుమకొండ టీబి హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, కాకతీయ మెడికల్ కాలేజ్ సామాజిక వైద్యశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ యాకూబ్ పాషా, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ, టీవీ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి, డాక్టర్ సునీత, ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఈవి శ్రీనివాసరావు, సర్వ ప్రేమ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బాలస్వామి జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, డిప్యూటీ డెమో ప్రసాద్, సి హెచ్ ఓ మాధవరెడ్డి, క్షయ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్, టీ బి సూపర్వైజర్లు విజరు , కిరణ్ కుమార్, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్లు, సెంట్ జాన్స్ నర్సింగ్ విద్యార్థినిలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
టీబీ అవగాహన ర్యాలీ
ప్రపంచ క్షయ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీ ని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ ర్యాలీలో క్షయ నియంత్రణ సంస్థ సిబ్బంది, సెంట్ జాన్స్ నర్సింగ్ విద్యార్థినిలు, టీబీ అలర్ట్ ఇండియా, సర్వ ప్రేమ స్వచ్ఛంద సంస్థ వారు ఫ్లకార్డ్స్, బ్యానర్స్ చేపట్టి, క్షయ వ్యాధి అంటువ్యాదని, టీబి అంతం మనందరి పంతం అనే నినాదాలతో ముందుకు సాగింది.