Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘాల డిమాండ్
నవతెలంగాణ-వరంగల్
అకాల వర్షాలవల్ల పంట నష్ట పోయిన రైతులకు తక్షణమే రూ. 20వేలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని రైతు సంఘాల నాయకులు డి మాండ్ చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు. అధ్య క్షతన వివిధసంఘాల నాయకులు రైతుసమస్యలు పరిష్కరించాలని రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అరగంటసేపు సంఘం జి ల్లా నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరగోని శంకరయ్య తెలంగాణ రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్‌లు మాట్లాడారు. రైతులు ఒక ఎకరంలో పంట పెట్టుబడి రూ.20 వేల నుండి రూ.25 వే లకు పైగా ఖర్చుపెడితే, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10 వేలు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. ఈ యా సంగి సీజన్లో పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతిబీభత్సం వల్ల వేలాది ఎకరాల్లో పంట నే లపాలైందని రైతులకు కోట్ల రూపాయలనష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఇదేనా అని వారు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు నీరుగా రిపోయిన ట్లుగా రుణమాఫీ కూడా అదే పద్ధతిలో ఉందని వారుఎద్దేవా చేశారు. ఏకకాలంలోనే పం ట రుణాలను రద్దు చేయా లని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ మహా సభ జిల్లా అధ్యక్షులు సుదమల్ల భాస్కర్, సంయుక్తకిసాన్ మహాసభజిల్లా అధ్యక్షులు వల్లందా స్కుమార్, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి.ఇస్మాయిల్, ఓదెల రాజయ్య, నాయకులు ప్రభాకర్ వెంకటేశ్వరరావు, రాజేందర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న అప్పా రావు, మానవ హక్కుల వేదిక జిల్లా నాయ కులు బండి కోటేశ్వరరావు తదితులున్నారు.