Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్
నవతెలంగాణ-కొత్తగూడ
భారత రాష్ట్ర సమితి బలం బలగం పార్టీ కార్యకర్తలేనని రాష్ట్ర గిరిజన సంక్షే మ మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పోగుళ్లపల్లిలో నిర్వహిం చిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లా డుతూ మాట తప్పకుండా మడమ తిప్ప కుండా కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామని ఉత్సాహంగా మీరంతా ముందుకు రావడం సంతోషకరమన్నారు. గుంజేడు ముసలమ్మ దేవాల యాన్ని కనీవిని ఎరుగనిరీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. దే శాన్ని ఇన్నేళ్లు ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. అకాల వ ర్షంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఆదుకున్న గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండే సబ్బండ వర్గాల సంక్షేమా ని కై ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా పేద ప్రజలు, రైతుల సంక్షే మం కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తుండడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ప్రతి పేదోడు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు జరగడంలేదని విమ ర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు, మహిళ ల పట్ల సంస్కారహీనంగా మాట్లాడేటోళ్లు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం సిగ్గుచేటన్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు అందిస్తామని, అన్ని రంగాలలో కొత్త గూడ మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్య క్రమంలో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, మహబూబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు,ములుగు జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, ఒడిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అ ధ్యక్షుడు కొమ్మెనబోయిన వేణు, బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి జవహర్ లాల్ నెహ్రు, సర్పంచ్ అజ్మీర మంగమ్మ రవి, ఎంపీటీసీ బైరబోయిన సదయ్య,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.