Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కార్మిక చట్టాలనుపెట్టుబడిదారి,కార్పొరేట్ శక్తుల కు అనుకూలంగా మార్చుతూ, సంపదను సృష్టించే కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్ర భుత్వాల పై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని టిపి టిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ పిలుపు నిచ్చా రు. వరంగల్ ఖిలావరంగల్లో నిర్వహించిన భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) జిల్లా మహా సభలకు కడారి భోగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మొదట మహాసభలు జెండాను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన 9 మందితో ప్రమా ణం స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ 'మేకిన్ ఇండియా' పేరిట భారత కార్మిక రంగాన్ని మోసగించిన ప్రభుత్వం జాతీయ సంపదల ను కార్పొరేట్ల పేరు చేసి, జాతీయ కార్మిక వర్గం యొ క్క హక్కులున్నంటినీ హరించి వేసిందని అన్నారు. కార్పొరేట్ వర్గాల సంపదను పెంచేందుకు ఇప్పటికే కార్మికులు సాధించుకున్న 44 కార్మిక హక్కుల చట్టా లను 4 కోడ్ లుగా విభజించి కార్మికరంగాన్ని వెట్టి బానిసలుగా మార్చిందని అన్నారు. అడవుల్లో విలువై న ఖనిజ సంపదను కార్పొరేట్ పరం చేసేందుకు అడ వుల నుండి గిరిజనులను తరిమికొట్టే చర్యలకు ప్రభు త్వం పాల్పడుతుందని అన్నారు. కేంద్రంతో విభేదించి ట్టు నటించే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చేస్తన్న పలు కార్మిక వ్యతిరేక చట్టాలకు మద్దతు పలుకుతూ వారి పబ్భం గడుపుకుంటున్నారని అన్నారు. సంఘ టిత రంగం, అసంఘటిత రంగాల్లో కార్మిక వర్గం ఈ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు తిప్పికొట్టేం దుకు జరిగే పోరాటాల్లో ముందుండాలని భారత కా ర్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) చేస్తున్న నిఖార్సైన పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలు పు నిచ్చారు.మహాసభలకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ మాట్లాడుతూ ఇటుక బట్టీ, బీడీ, తునికాకు, భవననిర్మాణ, ప్రింటింగ్ బైం డింగ్, హమాలీ కార్మిక సంఘాలన్నింటినీ మరింత బలోపేతం చేసి ఐక్యపోరాటాల ద్వారా కార్మిక వర్గ హక్కుల సాధనకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు.) మరింత నిర్మాణాత్మక పోరాటాల ను మున్ముందుకు తీసుకు వెళ్ళుతుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో టి.పి.టి.ఎఫ్ నాయకులు జిల్లా అజ రు బాబు, భీమళ్ళ సారయ్య, ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి నున్నా అప్పారావు,టిపిటిఎఫ్ నాయ కులు అజరు బాబులు పాల్గొన్నారు.