Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు కత్తి జనార్ధన్
నవతెలంగాణ-మట్టెవాడ
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు పలు సమ స్యలతో సతమతం అవుతున్నారని, వైద్య ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని వైద్య ఆరోగ్యశాఖ ఐక్య సంఘాల రాష్ట్ర నాయకుడు కత్తి జనార్ధన్ అన్నారు. వరంగల్ హనుమకొండ వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హల్లో సెంట్రల్ కోర్ కమిటీ నాయకులు బత్తిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ హనుమకొండ జిల్లాల 17 మందితో స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నారు.వరంగల్ హనుమకొండ జిల్లాల తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ నూతన కమి టీలని ఎన్నుకొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లా డుతూ కరోనా టైంలో ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన ఘ నత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి దక్కుతుందని కుటుంబ పరంగా ఎంత ఇబ్బంది ఉన్న ప్రజలకు సేవ చేసే విషయంలో వైద్య సిబ్బంది వెనక్కు తగ్గరని అన్నారు. పని ఒత్తిడితో సతమతం అవుతున్న మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వైద్య ఆరో గ్యశాఖ అన్ని క్యాడర్స్ ఉద్యోగులు రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలని అన్నా రు. 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ లేక ఇబ్బందులు పడుతు న్నారని కాంట్రాక్టు ఫార్మర్స్ టెక్నీషియన్స్ హెల్త్ అసిస్టెంట్ అప్తల్మిక్ ఆఫీసర్స్, రేడియో గ్రాఫర్స్ కి ఎటువంటి పరీక్ష పెట్టకుండా పర్మినెంట్ చేయాలని అన్నారు. 317 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు పంపించిన అన్ని రకాల క్యాడర్లను సొంత జిల్లాలోకి తీసుకోవాలన్నారు.అన్ని క్యాడర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్ డిఏలు చెల్లించాలని, ఉద్యోగులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో సేవలు అందించాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ.గోపాలరావు. కమల్చందు నాయక్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియే షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణచంద్ర, కార్యదర్శి ప్రవీణ్ ఐక్యవేదిక సెంట్రల్ కోర్ కమిటీ నాయకులు నెహ్రూచంద్, రాష్ట్ర మహిళ అసోసియేషన్ అధ్యక్షులు రొక్కం దేవిక ,ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, దేవేంద్ర, రాజ్ కుమార్, కమిటీ నాయకులు రాజయ్య, రామ రాజేష్ కన్నా, నూతనంగా ఎన్నికైన వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీ నాయకులు పాల్గొన్నారు.