Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్రూరల్
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకె ళ్లాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, గ్రామీ ణ అభివృద్ధి కమిషన్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకట నారాయణ గౌడ్లు అన్నారు. ఆదివారం మండలం లోని ఖానాపురం, జీకే తండాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగ ళపల్లి శ్రీనివాస్, వెంకటనారాయణ గౌడ్లు మాట్లా డుతూ ప్రజల ఆశీర్వాదం నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండు సార్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధి కార పగ్గాలు చేపట్టిందన్నారు. ఉద్యమ వీరులుగా ఆ నాడు.. నవ నిర్మాణయోధులుగా ఈనాడు పట్టుద ల.. అంకిత భావంతో పనిచేస్తూ అపూర్వ విజయా లు సాధించిపెట్టింది బీఆర్ఎస్ కార్యకర్తలేనని తెలి పారు. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకు లను.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టి సిపాయి బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం. అడిగినవీ.. అడగనవీ.. చెప్పినవీ.. చెప్పనవీ ఎన్నో పనులు చేస్తూ.. అందరి బంధువుగా నిలిచిందని, ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదని, ఏ ఒక్కరినీ విస్మరించలేదన్నారు. తెలంగాణ సమాజానికి పొత్తు ల సద్దిమూట బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. సంప దను పెంచుతూ.. ప్రజలకు పంచుతూ భారతదేశా న్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వ లంగా వెలుగొందుతున్నది తెలంగాణ అని తెలిపా రు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమల్లో లేవని, ఈ పథకాలపై అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలి పారు.ఈనెల 28న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాని కి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మాపురం, జీకే తం డా, ఖానాపురం సర్పంచులు కడెం యాకయ్య, అచ్చ మ్మ సోమ్లా నాయక్, ఉమారాణి సోమయ్య, పార్టీ ఇ న్చార్జి దొంగరి శంకర్, వీరేషం, ముద్ధం వీరారెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.