Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిజాన్ని రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రగతిశీల శక్తు లంతా ఐక్యంగా అడ్డుకోవాలని పిడిఎస్యు పూర్వ విద్యార్థుల రాష్ట్ర నిర్వహణ కమిటీ కన్వీనర్ ఆర్.గురువారెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం వరంగల్ జిల్లా కేం ద్రంలోని ఖిలా వరంగల్ ఫోర్ట్ రోడ్డులో గల అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ (అమరవీరు ల నగర్)లో పిడిఎస్యు పూర్వ రాష్ట్ర నేతలు బండి కోటేశ్వరరావు, తీగల జీవన్, సంగోజు రవిల అధ్యక్షతన పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.గురువారెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పాలన దేశ లౌకిక వ్యవస్థను ప్రజల ఐక్యత ను విచ్చిన్నం చేసేలా కొనసాగుతున్నదని, ఆర్ఎస్ఎస్, సంఫ్‌ు పరివార్, విహెచ్పి లాంటి మతోన్మాద సంస్థలను పెంచి పోషిస్తూ దేశాన్ని మతోన్మాద ఫాసిజాసుడి గుండం వైపు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజెపి తమ రాజకీయ అధి కార పీఠం కోసం ప్రజలల్లో కుల, మత, మూఢత్వ భావజాల విద్వేషాలను రెచ్చ గొడుతున్నదని అన్నారు.రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను, ప్రజా స్వామిక వాదులను, విప్లవ భావజాలం కలిగిన వారిపట్ల నిరంకుశ విధానాలను అనుసరిస్తూ,అక్రమ నిర్బంధాలకు, అరెస్టులకు కేసులకు పాల్పడుతున్నారని ఆక్షే పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిస్టు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లౌకిక,ప్రజాస్వామిక భావజాలం కలిగిన శక్తులు ఐక్యమై ప్రగతిశీల ఉద్యమాల్లో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పిడిఎస్యు. మొదటితరంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పని చేసిన పూర్వ విద్యార్థి నాయకులు నలిగంటి చంద్రమౌళి, స్వామి, కొత్తపల్లి రవి, సాగర్, ముంజా ల బిక్షపతి, గద్దల డానియల్, బెల్లంకొండ రమేష్, పాల్, మల్లన్న, ముల్క రవి, పి. శ్రీనివాస్, ఎం.డి యాకూబ్, ల్యాదల్ల రాజు, పరికిరత్నం పాల్గొన్నారు.