Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ పనులు బంద్, నిరవధిక సమ్మెకు సిద్దం కండి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పిలుపు
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఐకెపి వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని జరుగుతున్న దశలవారి పోరా టంలో జిల్లాలోని ఐకెపి వివోఏలు అందరూ కలిసి రావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కోరారు. ఆదివారం సీఐటీయూ ఆఫీసులో వెలిశాల సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఐకేపీ వివోఎ జిల్లా స్ట్రగుల్ కమిటీ సమావేశంలో ఆ యన పాల్గొని ప్రసంగిస్తూ గత 19 సంవత్సరాలుగా మహిళలను స్వయం సహా యక సంఘాలలో సభ్యులుగా చేర్పించి, లోన్లు ఇప్పించి, రికవరీలు చేయిస్తూ ఆర్థి క, సామాజిక చైతన్యం పెంపొందించడంతో పాటు ప్రభుత్వం చేపట్టే అనేక పథకా లను ప్రజలకు చేరవేయటంలో విఓఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ 17,606 మంది వివోఏ లు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ సిబ్బందికి వేతనలు పెంచడం సంతోషకరమైనప్పటికి వివోఏలను విస్మరించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వా లని, వివోఎల వ్యక్తిగత ఖాతాలోనే వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మూడు రోజులపాటు టోకెన్ సమ్మె నిర్వహించిన ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక లేనందున ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ పనులు బంద్ చేస్తున్నామని తెలిపారు. ఈలోపు ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మె చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. వివోఎల ఆత్మగౌరవ పోరాటంలో జిల్లాలోని ఐకెపి వివోఏలంద రూ కలిసి రావాలని ఆయన కోరారు. అనంతరం ఐకేపీ వివోఎ స్ట్రగుల్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా చింతా మౌనిక, కో-కన్వీనర్లుగా నానబాల పురుషోత్తం, నీలం కృష్ణవేణిలు ఎన్నికైనారు. ఈ సమావేశంలో స్ట్రగుల్ కమిటీ సభ్యులు శ్రీలత, లలిత, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.