Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వజ్రోత్సవాల సన్నాహక సమావేశం
నవతెలంగాణ-సంగెం
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సంగెం వజ్రోత్సవాలు నిర్వహించడానికి పాఠ శాల ఆవరణంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పూర్వ విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ బడి పిలుస్తుంది... కదలి రా...! మా తల్లిదండ్రులు మా జీవితం కొరకు నిరంతరం శ్రమిస్తే... తల్లి లాంటి పాఠశాల, గురువులు మాఎదుగుదల జీవిత ఆశయం కొరకు భాగస్వాములయ్యా రన్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి 75 వార్షికో త్సవ వేడుక వేదిక అవుతుందన్నారు. త్వరలో నిర్వహించే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంగెం ప్లాటినం జూబ్లీ వేడుకలకు ప్రతి ఒక్కరూ సూచనలు సలహాలు కొరకు కార్యక్రమం పూర్వ విద్యార్థులు అందరూ తమ తమ సలహాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అడహక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంగెం ఖాతా ఏర్పాటు చేసి ముందు ప్రణాళికలు చేసి విజయవంతం చేయడానికి కషి చేస్తామని పలువురు వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు కందగట్ల నరహరి, గూడ సుదర్శన్ రెడ్డి, గుండేటి బాబు, మెట్టుపల్లి మల్లయ్య, రాయపాటివెంకటేశ్వర్లు రావు, చిట్టిమల్ల రమేష్ బాబు, వేల్పుల కుమా రస్వామి, గుల్లపల్లి ఉమేందర్ గౌడ్, కక్కర్ల శరత్ బాబుగౌడ్, గాయపు రాజిరెడ్డి, మునుకుంట్ల మోహన్, మునుకుంట్ల కోటేశ్వర్, కుంటపల్లి ఉమాశంకర్, పులి రాజశేఖర్ గౌడ్, బొజ్జ సురేశ్, గుండేటి లవ కుమార్, మాధవ రెడ్డి, గన్ను సంపత్, గుండేటి శ్యామ్ కుమార్, రమేష్, రవి, ఏలియా, కుమారస్వామి, సాంబయ్య వివి ధ గ్రామాల నుంచి పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.