Authorization
Wed April 09, 2025 09:58:23 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
చిర్ర సాయి రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాథమికోన్నత పాఠశాల దబ్బగుంటపల్లి విద్యార్థినీ, విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రలో భాగంగా హైద రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, జంతు ప్రదర్శనశాల, పురాతన కట్ట డాలైన చార్మినార్,మక్కా మసీద్, హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియంను సంద ర్శించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డా.కల్నల్ సి. నరేందర్ రెడ్డి మాట్లా డుతూ విద్యార్థులకు ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల సందర్శన వల్ల మానసిక ఎదుగుదల చాలా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. పాఠశాల ఉపాధ్యాయ బృందం గొట్టె కనకయ్య, రత్నం, రఘుమూర్తి, ప్రవీణ్, పద్మలు ఉన్నారు.