Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ జిల్లా అధ్యక్షులు తేజవత్ అభినాయక్
నవతెలంగాణ-చిన్నగూడూరు
ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ విద్యార్థులకు మౌలిక వసతు లు లేక విద్యార్థులు దుర్భర పరి స్థితిలు ఎదుర్కొంటున్నారని బీఎ స్పీ జిల్లా అధ్యక్షులు తేజవత్ అభినాయక్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని వసతి గృహాలను బీఎస్పీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఎస్సీ హాస్టల్ ను ఎమ్మార్వో ఆఫీస్కు, ఎస్టి హాస్టలును కస్తూర్బా గురుకుల పాఠశాలకు వాడుకుంటున్నారు. అద్దె భవనాల్లో ఇరుగు గదుల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షం వస్తే ఒకపక్క బెడ్స్ అన్ని తడిసి ముద్దవుతున్నాయని విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యం విషపురుగుల భయంతో విద్యార్థు లు భయపడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం సొంత భవనాలు కేటా యించాలని లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టబోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు, అసెంబ్లీ నాయకులు జినక కృష్ణమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.