Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యవసాయాన్ని పె ట్టుబడి దోపిడీ దారులకు అప్పగిస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కా ర్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. ఆదివారం అఖిల భా రత రైతు కూలి సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఐదవ మహాసభలు నర్సంపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఈ మహా సభకు జిల్లాఅధ్యక్షులు ఆబర్ల రాజన్న అధ్యక్షత వహిం చగా ముఖ్య అతిథిగా ఐలయ్య మాట్లాడారు. నాణ్య మైన విత్తనాలు, ఎరువులు పురుగు మందులు వాటి పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అజమాయిషి లేదన్నా రు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించి 8 సంవత్సరాలు అవు తున్న రైతుల అప్పులు మాత్రమే రెట్టింపు అయ్యాయ ని ఆయన విమర్శించారు. దేశ రైతాంగం ప్రతి సంవ త్సరం రెండు లక్షల 65 వేల కోట్ల రూపాయలు నష్ట పోతున్నారన్నారు. ప్రతి సంవత్సరం 12 వేలకు పై గా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపా రు.రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక టించి నేటికీ అమలు చేయడంలో వైఫల్యం చెందింద న్నారు. రైతులకు రోజు బ్యాంక్ అధికారుల వేధింపు లు ఎక్కువ అవుతున్నాయని ఇప్పటికైనా ఏకకాలంలో మొత్తం రుణాన్ని మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల తుఫాను వల్ల రైతులు కోట్ల రూపా యలు నష్టం పోతే కేసీఆర్ నామమాత్రంగా రూ.10 వేలు ప్రకటించి చేతులు దులుపుకున్నాడని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. పోడు భూములకు పట్టాలి స్తామని అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమందికి అని నాలుకను మరలేసిందని విమర్శిం చారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న హిందూ బ్రాహ్మణీయ దాడులకు వ్యతిరేకంగా పోరాడాలన్నా రు. ఈ మహాసభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జగదీ శ్వర్ మాట్లాడుతూ సమాజంలో ఉండే కులమత అం తరాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉం దని ఆ దిశగా సంఘం ప్రయాణించాలని ఆయన సూచించారు. ఈ సభలో ప్రగతిశీల యువజన సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ సంఘ నాయకులు రాచర్ల బాలరాజులు మాట్లాడా రు. ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మ హాసభ ప్రతినిధులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆ బర్ల రాజన్న ప్రధాన కార్యదర్శిగా మొగిలి ప్రతాపరెడ్డి తోపాటు 11 మంది సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మ హాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభలో అరుణోదయ కళాకా రులు అజరు బృందం విప్లవ గీతాలు ఆలపించారు. మహాసభల ప్రారంభానికి ముందు జిల్లా అధ్యక్షులు ఆబర్ల రాజన్న జెండా ఆవిష్కరించారు. మహాసభలో విప్లవ రైతాంగ ఉద్యమంలో రాష్ట్ర నాయకురాలుగా పనిచేసి ఇటీవలనే మరణించిన బేబక్కకు ఇతర అ మరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ మహాసభలో జిల్లా నాయకులు జక్కుల తిరుపతి,గట్టి కష్ణ,భోగి సారంగ పాణి,బొమ్మడి సాంబయ్య, నరసింహారావులతోపాటు 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.