Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
బీజేపీ నియంత విధానాలను వ్యతిరేకిద్దామని సీపీఐ(ఎం) చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ అన్నారు.ఆదివారం మండలంలోనిక్రిష్ణాజి గూడెం గ్రామంలో జిల్లాలో నేడు జరిగే జనచైతన్య బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రిక ను ఆవిష్కరించారు. రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో మార్చి 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాపితంగా 33 జిల్లాల ను కవర్ చేస్తూ మూడు బృందాలు 'జనచైతన్య యా త్ర' పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నదని తెలిపా రు. ఈ సందర్భంగా మతోన్మాద బీజేపీ కార్పొరేట్, ఆర్ఎస్ఎస్ విధానాలను ఎండగట్టడానికి, రాష్ట్ర వ్యా పితంగా వామపక్షాల ప్రభావాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తు న తీసుకెళ్ళాలనే సదుద్దేశంతో సాగుతున్న ఈ యాత్ర కు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్ధతు ఇస్తున్నారని అన్నారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో దేశానికి, దేశ భవి ష్యత్‌పై జరుగుతున్న దుర్మార్గాలను ఎండగట్టడానికి, కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదం ఎంత ప్ర మాదమో తెలియజెప్పాలనే యాత్ర ఉద్దేశ్యమన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికై, మట్టి మనుషులు తుపాకులై దొరల, జమీందారులను తరి మి, రజాకారులను గడగడలాడించిన నిజాం సర్కా రునే గద్దె దింపిన, వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రగల ప్రాంతం తెలంగాణ అన్నారు. బందగీ చిం దించిన రక్తం చిట్యాల ఐలమ్మ వీరత్వం, దొడ్డి కొము రయ్య తొలి అమరత్వం, 4వేల మంది రక్త తర్పణతో తడిసిన పోరాటాల తెలంగాణ గడ్డ చరిత్రను వక్రీక రించి అధికారం చేపట్టాలని బిజెపి కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి కుల, మత ద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోగా, ప్రజా ఆస్తు ల్ని, బడా పారిశ్రామిక వేత్తలు మోడీ అప్పనంగా కట్ట బెడుతూన్నారని విమర్శించారు. సంక్షేమం, మతసా మరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయంకై ప్రజ లంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చా రు. ఈనెల 29న హైదరాబాద్, ఇందిరాపార్క్‌లో ము గింపు బహిరంగసభకు లక్షలాది మంది తరలివచ్చి జయప్రదం చేయాలని, సభకు పొలిట్ బ్యూరో సభ్యు లు ప్రకాష్ కారత్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌నాయకులు సాదం పరమేష్, కమీటి సభ్యులు సాదం చంద్రయ్య, నారబోయన బిక్ష పతి, పోలు శ్రీను, సాదం రాజు, ఊరడి మల్లయ్య, సా దం బీమయ్య, తదితరులు పాల్గొన్నారు.