Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ-జనగామ
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యమించాలని తెలంగాణ రజక వృత్తిదాల సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య పిలుపు నిచ్చారు.ఆదివారం జిల్లా కేం ద్రంలోని విజయ ఫంక్షన్ హాల్ నందు జరిగిన తెలంగాణ రజక వృత్తిదారుల సం ఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంజిల్లా అధ్యక్షులు మైలరం వెంకటేశ్వర్లు అద్య క్షత నిర్వహించారు.ఈ సమావేశానికి ఫైళ్ళ ఆశయ్యముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మందికిపైగా రజక వృత్తిదారులు ఉన్నారని సామా జికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల పైన నేటికీ సమాజంలో పెత్తందారులచే కుల వివక్షత, సామా జిక అణిచివేత, దాడులు, దౌర్జన్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నుండి రక్షణకై రజకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల్లోనే అత్యంత వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులను ఆదుకోవడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి రూ:5లక్ష ల రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ దవాఖానాలు, పోలీస్ శాఖలో, ఖాళీగా ఉన్న ధోబి పోస్టులు భర్తీ చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చే శారు. 50 ఏళ్ళు నిండిన వృత్తిదారులందరికీ వృద్ధాప్య పెన్షన్ పథకం ప్రవేశపె ట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ మాట్లాడుతూ ఇల్లు లేని రజకులందరికీ ఇళ్ల స్థలా లు ఇవ్వాలని కోరారు. రజక ఫెడరేషన్‌కు వెంటనే ప్రభుత్వం పాలకవర్గాలు నియ మించి వృత్తిదారుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రజకు లకు ప్రత్యేక బీమా పథకం ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏదునూరి, మదర్ సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శోభ, పి.సారయ్య, గోపాల్, జనగామ జిల్లా నాయకులు ఏదునూరి గట్టేశం, భూమా రంగయ్య, లొంక మల్లేష్, కొలిపా క నరసింహ, దుర్గాప్రసాద్, నాయకులు చిట్యాల సమ్మయ్య,లోంకా ఐలయ్య, పు న్నం శ్రీనివాస్, యామంకి రామగుండం మల్లేష్ జ్యోతి, యాదగిరి, శ్రీనివాస్, మిన ల్లపురం ఎల్లయ్య,పెళ్లిమెల్ల వెంకటేశ్వర్లు, పొన్నశ్రీను, పోలాస కొండలు, చల్లగురు ల ఐలయ్య, మేడిపల్లి వెంకటేశ్వర్లు, ఉల్లెంగుల కృష్ణ, సత్యనారాయణ, పొన్న శ్రీను, పొన్న రమేష్, భుపోశెట్టి రాంబాబు, రఘు తదితరులు పాల్గొన్నారు.