Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
పార్లమెంటులో ఆదాని కంపెనీలపై రాహుల్ గాంధీ నిలదీస్తాడనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని, ఇది సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండలంలోని రంగయ్య పల్లి, పెద్దంపల్లి, చెంచుపల్లి రేగొండ మండల కేం ద్రంలో మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో ఆత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం జరిగింది. అనంతరం యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాలను జీఎస్సార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. పెద్దంపల్లి గ్రామంలో చిన్నపిల్లలకు చాక్లెట్లను పంచి, ఓ ఇంటి వద్ద పిండి వంటలు చేస్తున్న వృద్ధురాలితో మాట్లాడుతూ పిండివంటలు కాల్చారు. అనంతరం పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలల్లో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై చర్చ పెట్టకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలేనని తెలిపారు. ఈ కుట్రపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం, అదానీ - మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులే కుండా చేస్తున్నాయన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అదానీపై చర్చ జరగకుండా బీజేపీ అన్నిరకాలుగాప్రయత్నిస్తోందన్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని గండ్ర అన్నారు. ఈ యాత్రలో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, మండల సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, గూటోజు కిష్టయ్య, మేకల రవికుమార్, బొల్లేపల్లి చంద్రమౌళి, మేకల భిక్షపతి, తిరుపతిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి విరోధం : స్వప్నరెడ్డి
కాటారం : రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్య త్వంపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి విరోధమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్న పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన సాగిస్తుం దని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ప్రధానమంత్రి మోడీ అధికారిక దుర్వినియోగానికి పాల్పడి రాహుల్ గాంధీ పై తప్పుడు సాక్షాధారాలతో కేసు నమోదు చేయించారన్నారు. అధికార దుర్విని యోగానికి పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రధాని మోడీ రాహుల్ గాంధీని పార్లమెంటుకు రెండు సంవత్సరాలు అనర్హులుగా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. మోడీ చర్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి అనుకూలంగా సీఎం కేసీఆర్, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు, తదితర ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్‌గాంధీపై వేటును ఖండించడం శుభసూచకమని అన్నారు. రాహుల్ గాంధీ పై తీసుకున్న అనర్హత వేటును ఎత్తివేయాలని కోరారు.