Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నాయిగూడెం మండలంలో శ్రీకారం చుట్టిన సీఆర్పీఆఫ్ సిబ్బంది...
- పాల్గొన్న జిల్లా పోలీస్ అధికారులు
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఆదివారం సివిక్ యాక్షన్ ప్రోగ్రాంను సీఆర్పీఆఫ్ 39 బెటాలియాన్ కమాండెంట్ రమాకాంత్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ముఖ్యఅతిధిగా ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం హాజరయ్యారు. కన్నాయి గూడెంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును ప్రారం భించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం, అందులో మెడికల్ క్యాంపు సీఆర్పీఆఫ్ సిబ్బంది ఏర్పాటు చేయడం అందరికి ఉపయోగక రమైన కార్యక్రమం అన్నారు. అనంతరం యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని కోరుతూ యువతకు ఆటవస్తువులను పంపిణీ చేశారు. అనంతరం సీఆర్పీఆఫ్ కామాండెంట్ రమాకాంత్ పాండా మాట్లాడుతూ.. యువత చదువులతో పాటు ఆటల్లో రాణించాలని, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే యువతకి సీఆర్పీఆఫ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.
మహౌన్నత కార్యక్రమం
మండలంలోని 39 బెటాలియన్ సీఆర్పీఆఫ్ కమాండెంట్ రమాకాంత్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం ఆదివారం కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. గతంలో కూడా కన్నాయిగూడెం మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీఆర్పీఆఫ్ సిబ్బంది తెలిపారు. ప్రతి ఆరు నెలలకి ఒకసారి సివిక్ యాక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందని, ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను తమ సిబ్బంది జీతాల నుంచి నెల నెల కొంత మేర పొదుపు చేసి ప్రజలకి అవసరమైన సౌకర్యాలని కల్పించడం జరుగుతుందని తెలిపారు.
భోజన సదుపాయాలు
కన్నాయిగూడెం మండలంలో సీఆర్పీఆఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున సివిక్ యాక్షన్ కార్యక్రమం నిర్వహిస్తుండటంతో మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి అనేక మంది ప్రజలు ఉదయం పూటనే వస్తారని ముందే గ్రహించిన స్థానిక సీఆర్పీఎఫ్ జవాన్లు భోజన వసతి ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలతో వచ్చిన మహిళలు భోజన సదుపాయాలు చూసి పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
విశేష స్పందన
మండలంలో ఆదివారం సీఆర్పీఆఫ్ సిబ్బంది సివిక్ యాక్షన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అయినటు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మాన్ని మండల ప్రజలు, ముఖ్యం గొత్తికో యలు చంటి బిడ్డలతో వచ్చి తమ ఆరోగ్య సమ స్యలను డాక్టర్లకి వివరించి మందులు తీసుకోవడం జరిగింది. డాక్టర్ భార్గవి, డాక్టర్ అఖిల ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు ఓఎస్డీ అశోక్ కుమార్, ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ మండల రాజు, కన్నాయిగూడెం ఎస్ఐ సురేష్, సీఆర్పీఆఫ్ డాక్టర్ భార్గవి, కన్నాయిగూడెం ప్రాథమిక వైద్యశాల వైద్యులు అఖిల, ఏటూరునాగారం వైద్యులు వర ప్రసాద్, ఏ-39 సీఆర్పీఆఫ్ ఇన్స్పెక్టర్ విపిన్ కుమార్ దాస్ ఎన్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ నర్సింగారావు, కే రాఘవేంద్ర, పలువురు సివిల్, సీఆర్పీఆఫ్ సిబ్బంది పాల్గొన్నారు.